KIDS TALENT
TAGB New Committee, Sankranthi Sambaralu

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ ప్రస్తుత కార్యవర్గ ప్రెసిడెంటు శ్రీ కందుకూరి కోటేశ్వరరావు నిర్వహణలో సంక్రాంతి సంబరాలని నిర్వహించి, 2012 క్రొత్తకార్యవర్గానికి విజయపతాకాన్ని అందించారు.

 

 

స్థానిక లిటిల్ టన్ హైస్కూల్ లో శనివారం 28 జనవరిన జరిగిన కార్యక్రమంలో 700 మందిగి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. స్కూల్ ప్రాంగణం, ఆడిటోరియం చాలా అందంగా తీర్చిదిద్దారు. నాటి కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలతో పాటు భారత రిపబ్లిక్ దినోత్సవాన్ని కూడా శ్రీమతి రాధిక దీక్షిత్ గారు ఆలాపించిన దేశ భక్తి గీతాలతో, వివిధ నృత్యాలతో వేడుకగా జరుపుకొన్నారు.

 

 

ప్రవాసాంధ్రులు ప్రాచీన కళల పట్ల చూపే శ్రద్ధ, ఉత్సహాం చాలా కొనియాడతగినది. కార్యవర్గం యిచ్చిన పిలుపుకు సభ్యులందరు ఉత్సాహంగా పాల్గొని అద్భుతమైన నృత్యాలతో, పాటలతో, పోతన పద్యాలతో కనులకు, వీనులకు విందుచేసారు అంటే అతిశయోక్తి కానేకాదు. సంబరాలలో ప్రత్యేకత రకరకాల పోటీలు నిర్వహించడం: ఆర్ట్, లిటరరి, రంగోలి, బొమ్మల కొలువు వంటి పోటీలలో అన్ని వయస్సుల వారు పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు.

 

 

చిన్నారులగ్రూప్ లో, ఆర్ట్ లో అభిజిత్ సంబంగి, సాయివాగ్మిత కంతేటి, చరిత బాడ్వేలు; లిటరిలో అభిజిత్ సంబంగి; సీనియర్ గ్రూప్ లో రంగోలీలో నిర్మల సంబంగి, జ్యోతి సంబంగి, కన్యాకుమారి కందుకూరి; బొమ్మలకొలువులో శ్రీమతి లలిత చిలకమర్రి, స్వాతి తాడుయొయి; లిటరరి లో బాబు తమ్మిశెట్టి, మల్లారెడ్డి కర్ర, శ్రీనివాస్ కాకి విజేతలుగానిలిచారు. వాలంటీరులు తయారు చేసిన రకరకాల ఫలాహారాలు అతిధులకు సంతృప్తి, సంస్థకు ఆదాయాన్ని చేకూర్చింది.

 

 

అల్బనీ తెలుగు గ్రూప్ వారు ప్రదర్శించిన నాటకం, కనక్టికట్ "CT Rhythms" వారు వీనులు విందైన సినిమాపాటల కార్యక్రమాలు నాటి వేడుకల్లో ప్రత్యేకమయినవే కాకుండా అతిధుల మన్నలని అందుకున్నాయి. శ్రీమతి దీప్తి గోరా, శ్రీమతి ఉమ ఎలమంచిలి, ప్రియాంకా బొడ్డు అతి చక్కటి సంభాషణలతో, సమస్యా పూరణాలతో, చిక్కు ప్ర శ్నలతో అతిధులని ఆకర్షించి మంచి వ్యాఖ్యాతలుగా మన్ననలు పొందారు.

 

 

కల్చరల్ సెక్రటరి శ్రీమతి మాధవి దోనెపూడి స్వాగత పలుకులతో ప్ర్రారంభమయిన కార్యక్రమం లో ప్రెసిడెంటు శ్రీ కందుకూరి కోటేశ్వరరావు తన కార్యవర్గం (Srinivas Kollipara -President Elect, Ramesh Babu Tallam-Secretary; Janardhan Sonthi-Treasurer, Smt.Madhavi Donepudi-Cultural Secretary, Janakiram Gubbala-Jt.Secretary & Babu Tammisetty-Jt.Treasurer) కు అభినందనలు తెలుపుతూ, మరియు అందరి తరుఫున తమకు అవకాశం ఇచ్చి ఆదరించిన ప్రముఖ కార్యకర్తలకు, పలు సంస్థలకు, సహచరులుకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

ఆయన 2011 వ సం. లో 12 రకరకాల కార్యక్రమాలని నిర్వహించిన విభిన్న కమిటీ సభ్యులకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ-పత్రిక ప్రారంభించడం, జిమ్మిఫండు కొరకు $12500 విరాళాలు సేకరించడం TAGB చరిత్రలో మంచి ఘట్టాలుగా నిలిచి పోతాయి అన్నారు. అన్ని కార్యక్రమాలకు వెన్నుతట్టి నిలిచిన BOT కార్యవర్గం ( S/Sri.Paparao Gundavaram-Chairman, Sreenivas Kaki and Prakash Reddy)కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.

 

 

ఎలక్షన్ కమీషన్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆహూతుల కరతాళ ధ్వనులమధ్య శుభప్రదంగా 2012-2013 కార్యవర్గం, శ్రీ కొల్లిపర శ్రీనివాస్ అధ్యక్షతన బాధ్యతలు అందుకున్నారు.

 

 

2012 TAGB Executive Committee:

S/Sri.Srinivas Killipara - President

Ramesh Babu Tallam - President Elect

Janakiram Gubbala - Secretary

Niranjan Avadhuta - Cultural Secretary

Chandra Talluri - Treasurer

Shankar Magapu - Jt.Secretary

Sinivas Batchu - Jt.Treasurer

 

Board of Trustees:

S/Sri.Dr.Gonvida Rao Bhisetty - Chair

Babu Rao Polavarapu - Vice-Chair

Mallareddy Karra

Purnarao Bolneni

Dr.Hari Babu Muddana

Koteswara Rao Kandukuri

Janardhan Sonthi

 

BOT ఛైర్మన్ శ్రీ పాపారావు విజేతలకు బహుమతులు ఇవ్వడం, జనరల్ సెక్రటరి శ్రీ రమేష్ తల్లం అందరికి ధన్యవాదాలుతో, 6 గం.ల పాటు జరిగిన నాటి వేడుకలు జయప్రదంగా ముగిసాయి.

TeluguOne For Your Business
About TeluguOne
;