ARTICLES
కొలంబస్ లో మేడసానివారి అష్టావధానం

తెలుగు భాషా సంపద, సంస్క్రుతి భావితరాలకు వారసత్వంగా అందించాలనే ఉద్దేశ్యముతో స్థాపించిన టాకో (తెలుగు అస్సోషియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహాయొ) ఆధ్వర్యములొ కొలంబస్ నగరములో గత ఆదివారము స్థానిక శ్రీ షిర్డి సాయిబాబా ఆలయ ప్రాంగణములో శ్రీ మేడసాని మోహన్ గారి ఆధ్యాత్మిక ప్రవచనము మరియు అష్టావధాన కార్యక్రమము ఆహ్లదకర వాతావరణములొ అత్యంత మనోరంజకముగా నిర్వహించబడినది.

రాయలవారి విరచిత గ్రంధము "ఆముక్తమాల్యద" ప్రాశస్త్యము గురించిన వివరణతో మొదలైన మేడసాని వారి కార్యక్రమము ఎనిమిది మంది ప్రుచ్ఛకులతో, అష్టాంగములతో సాగిన అష్టావధాన కార్యక్రమము ఆద్యంతము ఆహుతులను అలరించినది.

కార్యక్రమము చివరగా టాకో అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ సంగా గారు మేడసా  ని గారిని జ్ఞాపిక, దుశ్శాలువతో సత్కరించగా, అక్షరమాల నిర్వాహకులు శ్రీ నాగేశ్వర రావు మన్నే గారు మేడసాని గారికి మరియు కార్యక్రమము విజయవంతము కావటానికి సహకరించిన వెంకట్ కొసరాజు, రవి వంగూరి, సురేష్ పూదోట, అశోక్ కామినేని, వెంకట్ కుపారి, వెంకట రమణ గార్లకు కృతజ్ఞతాభివందనములు తెలుపుతూ సభకు వందన సమర్పణ గావించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;