ARTICLES
మరణించిన తెలుగు యువకుడికి అన్నీతానైన మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం


నిజామాబాద్‌కు చెందిన కలవ బాలకృష్ణ అనే యువకుడు పొట్టకూటి కోసం మలేషియా వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో వెల్డర్‌గా పని చేసేవాడు. అయితే గత పది రోజుల క్రితం అతని నుంచి తన తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘాన్ని ఆశ్రయించారు. వెంటనే స్పందించి రంగంలోకి దిగిన సంఘం సభ్యులు బాలకృష్ణ ఆచూకీని తెలుసుకోవడం కోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. చివరికి కోట తిగ్గిమ్‌లోని ఆసుపత్రిలో అనాథ శవంగా పడివున్న బాలకృష్ణ మృతదేహన్ని అక్కడి అధికారులతో మాట్లాడి స్వాధీనం చేసుకున్నారు. వెంటనే బాలకృష్ణ తల్లిదండ్రులకు జరిగిన ఘోరాన్ని తెలిపి భౌతికకాయాన్ని మలేసియా, భారతీయ ఎంబసీల సాయంతో హైదరాబాద్ కు పంపించే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా మృతదేహన్ని భారతదేశానికి పంపేందుకు అయ్యే ఖర్చులను కూడా ఏర్పాటు చేశారు .


ప్రతిరోజూ లాగే ఆ రోజు పనికి వెళ్లిన బాలకృష్ణ. పనిచేస్తూ ఉండగానే సడన్‌గా అతనికి తీవ్రమైన గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఇది గమినించిన తోటి ఉద్యోగులు బాలకృష్ణను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అతను చనిపోయిన విషయం ప్రపంచానికి తెలియదు.ఇదే సమయంలో బాలకృష్ణ ఆచూకీ కోసం వెతుకుతున్న మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం అతని మరణవార్తను ప్రపంచానికి తెలియజేసింది. మరియు కొడుకు కోసం తల్లడిల్లిపోతున్న అతని తల్లిదండ్రులకు బాలకృష్ణ మరణవార్తను తెలిపారు. అయితే అతని భౌతికకాయాన్ని భారత్‌కు రప్పించేంత శక్తి ఆ తల్లిదండ్రులకు లేదు. దీంతో పెద్దమనసు చేసుకున్న ఆ సంఘం సభ్యులు బాలకృష్ణ మృతదేహన్ని ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేసి అతని తల్లిదండ్రులకు చివరి చూపు చూసుకునే భాగ్యాన్ని కలిగించారు. కొడుకు కోసం తల్లడిల్లుతున్న ఆ తల్లిదండ్రుల కష్టాన్ని తీర్చిన మలేషియా తెలుగు ప్రవాసితుల సంఘం కృషి నిజంగా అభినందనీయం.

TeluguOne For Your Business
About TeluguOne
;