ARTICLES
న్యూజెర్సీలో ఘనంగా జరిగిన యోగా డే

 

న్యూజెర్సీలో ఘనంగా జరిగిన యోగా డే


న్యూ జెర్సీ - జూన్ 21  రెండవ అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా గౌరవ నీయులు మనోజ్ మోహాపాత్ర (Deputy Consul General, Indian Consulate, NEWYORK -USA)  మరియు ఉపేంద్ర చివుకుల గారు (అమెరికా కాంగ్రెస్ మెన్), తో పాటు సుమారు 600+ మంది పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు విస్తృత ప్రచారం కల్పించడం, యోగా గొప్పదనాన్ని విశ్వ వ్యాప్తం చేయడం, యోగా పుట్టింది భారతదేశంలోనే ,యోగాను  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించే సందర్భంలో తాము పొందే అనుభూతిని వర్ణించలేమని  చెప్పారు. 192 దేశాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుతున్నారని  భారత వారసత్వ సంపదైన యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రపంచాన్ని శాంతి, సామరస్య మార్గంలో నడిపించడానికి యోగానే సరైన మార్గమని అన్నారు.

 

 

యోగా ఏ మతానికో, ప్రాంతానికో సంబంధించిన అంశం కాదన్నారు. శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసి మన వాస్తవ శక్తిని తెలియచేసే శాస్ర్తీయ విధానమని పేర్కొన్నారు. సురక్షిత, ఆరోగ్య, సంతోషమైన ప్రపంచం కోసం అందరం ఏకమవ్వాల్సి ఉందని అన్నారు.

 

 

ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన ఎన్నో కానుకల్లో అపూరుపమైనది 'యోగా' ప్రతి ఏటా జూన్ 21ని 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'గా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ఈ గుర్తింపు లాంఛనం మాత్రమే. యోగా ఏనాడో మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తమైంది. పతంజలి మహర్షి సూచించిన అష్టాంగ యోగ సూత్రాల నుండి రూపు దిద్దుకున్న యోగకు అధికారికంగా ప్రపంచ గుర్తింపు రావడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం.. యోగాలో ప్రధానంగా కనిపించేవి ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, ముద్రలు, క్రియలు, ఆసనాలు.. ఇందులో అనేక ఆసనాలు కనిపిస్తున్నా ప్రధానంగా 25 వరకూ ప్రాచుర్యంలో ఉన్నాయి.

 

 

 

ఈ ఆసనాలు వేయడం వల్ల తల నుండి కాలి చిటికన వేలు వరకూ మన శరీరమంతా చురుగ్గా పని చేస్తుంది. శరీరం చక్కగా వంగటం వల్ల రక్త ప్రసరణ అన్ని అవయవాలుకు సక్రమంగా జరుగుతుంది. శ్వాస మెరుగవుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, వెన్నుపూస చురుగ్గా పని చేస్తాయి. చక్కగా యోగాసనాలు చేసే వారికి శారీరక కష్టాలు తగ్గుతాయి. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చు. ఇప్పటికే ఉంటే పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవచ్చు. తద్వార మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బద్దకాన్ని విడిచిపెట్టి చురుగ్గా పని చేసుకోగలుగుతాం. మెదడు చురుగ్గా పని చేయడం వల్ల మనలో కొత్త ఆలోచనలు పుంతలు తొక్కుతాయి. మొత్తం మీద సంపూర్ణ ఆరోగ్యానికి యోగా పూర్తి గ్యారంటి ఇస్తుంది..

 

 

శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడం కోసం జిమ్ములు, ఆరోబిక్స్, ఇతర పాశ్చాత్య వ్యాయామాల కోసం డబ్బును ఖర్చు చేస్తున్నాం.. కానీ యోగాకు ఇవేమీ అవసరం లేదు.. చక్కగా మీ ఇంట్లో, లేదా శుద్దమైన గాలి, వెలుతురు సక్రమంగా ఉన్న తగిన చోటు చూసుకొని ఆసనాలు వేసుకోవచ్చు. అందరూ యోగాసనాలు వేయండి.. సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి.. యోగాతో రోగ రహిత సమాజాన్ని రూపొందిద్దాం అని  తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో హిందూ స్వయం సేవక్ అమెరికా , ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బారతీయ జనత పార్టీ మిత్ర బృందం , ఆర్ట్ అఫ్ లివింగ్ , ఏకల్ విద్యాలయ , ఇండియన్ బిజినెస్ కమ్యూనిటీ ,సేవ అమెరికా , ఇషా  ఫౌండేషన్ ,  విశ్వా హిందూ పరిషత్ అఫ్ అమెరికా, విహంగ  యోగా , తెలుగు సంఘాలు , తెలంగాణ సంఘాలు,  మిగితా కమ్యూనిటీ లోకల్ సంస్థలు  పాల్గొన్నాయి .

 

ఆదివారం జరిగిన కార్యక్రమంలో  ఎలౌజి రావ్ ,  నిమేష్ దీక్షిత్ , కేశవ్ దేవ్ , శేకర్ కాకర్ల, రఘు , కృష్ణ రెడ్డి అనుగుల, అరవింద్ మోదిని, రాఘవీర్ ,విజయ్ మల్లం పాటి, విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ ,  రామ్ వేముల ,  ప్రదీప్ , కిశోర్ , విశ్వ జిత్ మరియు ఇతరలు పాల్గొన్నారు ..

TeluguOne For Your Business
About TeluguOne
;