డెట్రాయిట్‌లో వైఎస్‌ఆర్ వర్ధంతి
డెట్రాయిట్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వితీయ వర్ధంతిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డెట్రాయిట్ విభాగం 2011, సెప్టెంబర్ 10వ తేదిన ఘనంగా నిర్వహించారు. పేద ప్రజల సంక్షేమానికి పాటుపడిన వైఎస్‌ఆర్ ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లే ప్రతి ఒక్కరికి తమ మద్దతు ఉంటుందని డెట్రాయిట్‌లోని ప్రవాసాంధ్రులు తెలిపారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు సబ్బం హరి మాట్లాడుతూ..రాష్ట్రంలో దివంగత నేత వైఎస్‌ఆర్ అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల్ని ముందుకు తీసుకువేళ్లే సమర్ధత ఒక్క జగన్‌మోహనరెడ్డికే ఉందన్నారు. ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్సీ జూపుడి ప్రభాకరరావు ఉద్వేగపూరిత ప్రసంగం అందర్ని కదిలించింది. ఈ సందర్భంగా ప్రజాదరణ పొందిన వైఎస్‌ఆర్ సంక్షేమ పథకాల్ని జూపుడి ప్రస్తావించారు. రాష్ట్రాభివృద్ది కొరకు యువనేత వైఎస్ జగన్మోహనరెడ్డికి బాసటగా నిలువాలన్నారు.
సెయింట్ తోమా కాన్ఫరెన్స్ సెంటర్‌లో జరిగిన వైఎస్‌ఆర్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమానికి భారీ సంఖ్యలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ‘వైఎస్‌ఆర్ అమర్ రహే’ అంటూ మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. ముఖ్య అతిధులకు హరిప్రసాద్ రెడ్డి లింగాల ఆహ్వనం పలికి, సభా కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామచంద్రరెడ్డి, యార్లగడ్డ శివరాం, కుకునూరు వినోద్, యాదం బాలాజీ, భూమిరెడ్డి యుగంధర్, శ్రీనివాస్ చిట్టలూరి, పిడపర్తి శ్రీనివాస్, రవి కిరణ్, మండూటి సునీల్, శ్రీనివాస్ బార్ల, నాగేందర్ గాలి, వినోద్ ఆత్మకూర్, మారుపుడి విజయ్, బీరం వెంకట్, కూకటి పురుషోత్తం, సాంబి రెడ్డి , కొండ పృథ్వీ, దేవనాథ్ రెడ్డి, వేణు కాగితాల, గుణశేఖర్ చిగరపల్లిలు పాల్గొన్నారు.