MEMORIES
నాట్స్ ఆధ్వర్యంలో డాలస్ లో ఉచిత వైద్య శిబిరం

 

నాట్స్ ఆధ్వర్యంలో డాలస్ లో ఉచిత వైద్య శిబిరం

 

డల్లాస్ లో నాట్స్ & సౌత్‌ఫోర్క్ డెంటల్ క్లినిక్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
సౌత్‌ఫోర్క్ డెంటల్ క్లినిక్ సహకారంతో ఉచిత వైద్య సేవలు

భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే నాట్స్ దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తూనే ఉంది.. తాజాగా డాలస్ లోని ఇర్వింగ్ లో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. మానవసేవయే మాధవ సేవ అని భావించే వైద్యులు, నాట్స్ సేవా వారధులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ విలువైన సేవలు అందించారు. డాలస్ లో ఎంతో మంది రోగులు ఈ ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసి వైద్య సేవలు పొందారు. రోగులను పరీక్షించి వారికి అవసరమైన వైద్య సేవలు, సలహాలను వైద్యులు అందించారు.  మధుమేహము, రక్తపోటు  ఉన్నవారికి ప్రత్యేక పరీక్షలు చేసి, వారికి పౌష్టికాహారం, ఆహారపుటలవాట్లు, ఆరోగ్య జీవనశైలి ఆవశ్యకతను వివరించారు. ఇన్సూరెన్స్ సౌకర్యం లేనివారికి, ఇండియా నుండి తమ పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు ఈ ఉచిత వైద్యశిబిరం బాగా మేలు చేసింది. ఇండియానుండి ఆరోగ్యసమస్యలతో వచ్చినవారికి కూడా వారి ఆరోగ్య సమస్యల పై సెకండ్ ఒపీనియన్ అందించడం మందుల్ని అడ్జస్ట్ చేయడం వంటి సలహాలు అందించారు. ఈ శిబిరానికి వచ్చి సేవలు ఉపయోగించుకొన్న మధుమేహ రోగులకు ఉచితంగా గ్లూకోమీటర్లు కూడా పంపిణీ చేశారు. ఈ ఉచిత వైద్యశిబిరంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖ వైద్యులు, మూడు వందల మందికి  పైగా ప్రవాసాంధ్రులకు వైద్యపరీక్షలు చేసి  తమ సలహాలు, సూచనలు అందించారు. ఈ శిబిరంలో డా. కిషోర్ ఎలప్రోలు , డా. వందన మద్దాలి,  డా. రాజు   గుత్తికొండ  (ఎండోక్రైనాలజిస్ట్), డా యోగి చిమటా (నెఫ్రాలజిస్ట్), డా శిల్ప దండా (నెఫ్రాలజిస్ట్), డా లత వేలుస్వామి (నెఫ్రాలజిస్ట్)  డా. బిందు కొల్లి (డెంటిస్ట్) పాల్గొని తమ సేవలందించారు. ఫ్లవర్‌మౌండ్ ఇర్వింగ్ ఇండియన్ సెంటినియల్ లయన్స్ క్లబ్‌వారు విజన్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహీంచారు.

ఈ వైద్యశిబిరానికి నాట్స్ సంస్థ  నుండి సమన్వయకర్తలుగా వెంకట్ కొల్లి, కిషోర్ కంచర్ల, జ్యోతి వనం, అజయ్ గోవాడ వ్యవహరించగా, టాంటేక్స్ సంస్థ నుండి ప్రెసిడెంట్ కృష్ణవేణి శీలం, ప్రెసిడెంట్-ఎలక్ట్ చినసత్యం వీర్నాపు, వైస్-ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి కోడూరు కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. విద్యార్థి వాలంటీర్లుగా ప్రణీత్ మన్నె, తన్వి కొంగర, పూజ కొల్లి, విష్ణు అర్థుం, రాహుల్ బట్లంకి, హర్షిత్ వనం, సాహస్ చిన్ని, నిఖిల్ గుడ్డాటి, ఆశ్లేష్ మరిపల్లి, అనూహ్య మొరవనెని, శ్రీహిత్ మొరవనెని, విక్రాంత్ కొల్లి, అను బోయపాటి, శ్రేయస్ గున్న, అభిరాం గద్దె పాల్గొన్నారు.  డా. బిందు కొల్లిగారు మాట్లాడుతూ ఈ శిబిరం ఇంత విజయవంతం కావటానికి సహకరించిన వైద్యులు అందరకూ, ఇక్కడకు విజిట్‌కి వచ్చి ఉన్న తల్లి తండ్రులలో ఈ వైద్య శిబిరం గురించి ప్రచారం కల్పించిన నాట్స్ వాలంటీర్స్ నాగరాజు తాడిబోయిన, శ్రీలక్ష్మి మండిగ లకు మరియు ఈ శిబిరం విజయవంతం అవటానికి కారణం అయిన  మురళి వనం, రామకృష్ణ నిమ్మగడ్డ, సుబ్బారావు పొన్నూరు, రామక్రిష్ణ కోగంటి, క్రిష్న కోరాడ, భాను లంక, మంజు నందమూడి, తులసి దేవభక్తుని, దీప్తి దేవభక్తుని లకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. దీంతో పాటు ఈ శిబిరం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకొని మీడియా తరపున ప్రచారంలో సహకరించిన  కె సి చేకురి, సుబ్బారెడ్డి నరపాలను అభినందించింది. నాట్స్ మరియు సౌత్‌ఫోర్క్ డెంటల్ సంస్థలు ఇటువంటి మెడికల్ క్యాంపులను తరచూ నిర్వహించడం ద్వారా ఇన్సూరెన్స్ సౌకర్యంలేని తమకు నిష్ణాతులైన వైద్యులతో వైద్యసహాయాన్ని అందించడంపట్ల ఈ ఉచిత వైద్యసేవలను పొందిన తల్లిదండ్రులు, ప్రవాసాంధ్రులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. 

ఈ శిబిరం నిర్వహణలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్), మెట్రో తమిళ సంఘం సహకరించాయి. ఈవెంట్ స్పాన్సర్లు గా అంజప్పర్ రెస్టారెంట్, హాట్ బ్రెడ్స్,రామ్ కొంగర, ఎస్సార్సీ ఫార్మసీ, సౌత్‌ఫోర్క్ డెంటల్ వ్యవహరించాయి.
 


TeluguOne For Your Business
About TeluguOne
;