ARTICLES
అమెరికా వనాలలో ఆంధ్ర విందు భోజనాలు

చికాగో ఆంధ్రా సంఘం వారి వేసవి వనభోజనాలతో చికాగో నగరం తెలుగు వంటకాల రుచులతో, ఆంధ్రా పద్ధతులతో కళకళలాడింది. ప్రతి ఏడూ లాగే, ఈ ఏడాది కూడా ఫాథర్స్ డే వారోత్సవాన 6/16న  శాంబర్గ్ లోని బస్సే పార్క్ ఉదయం 11 గంటల నుంచి, సాయంత్రం 6 దాకా పెద్దలు పిల్లలు అందరూ ఆటలు, పాటలు, విందు భోజనాలతో ఆనందించారు.

తెలుగు వారందరు ఆత్మీయంగా కలుసుకొని విందు భోజనాలని ఆరగించారు. 

Dr. ఉమ కటికి అధ్యక్షతన చికాగో ఆంధ్ర సంఘం వారు, వారి సాంప్రదాయాన్ని కొనసాగిస్తు, ఈ ఏడాది కూడా అరిటాకులలో వడ్డించడం పలువురిని ఆకట్టుకుంది.

 
 
ఆంధ్రా సాంప్రదాయ వంటలతో అతిథులని పేరుపేరున పలకరిస్తూ CAA బోర్డు డైరెక్టర్లు చేసిన కృషి అందరి మన్ననలు పొందింది. విశేషంగా వేసవిని చికాగోలోని తమ పిల్లలతో గడపాలని ఆంధ్ర వచ్చిన తల్లిదండ్రులు CAA వారి ఆత్మీయతకి అబ్బురపడ్డారు. ఆంధ్రలోనే బఫెట్ పద్ధతికి అలవాటు పడుతున్న రోజుల్లో అగ్ర రాజ్యంలో CAA వారి కృషి అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.
 
ఆంధ్ర రుచులైన పులిహోరతో పాటు ఊరగాయ, ముక్కల పులుసు, బెండకాయ వేపుడు రుచి అమోఘమని, అన్నిటికన్నా పెరుగవ్వడా రుచికి సాటి లేదు పలువురు వ్యాఖ్యానించారు. ఫుడ్ కమిటీ చైర్ సాయి రవి సూరిభోట్ల మాట్లాడుతూ పెరుగవ్వడా తింటే ఆంధ్ర వెళ్లాలని లేదా చికాగో ఆంధ్ర సంఘం వన భోజనాలకి రావాలి అనడం అందరితో నవ్వుల పూయించింది.
 
 
అయిదు వందల పైగా అతిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో CPR ఎలా చేయాలి అన్న అంశంపై CAA కార్యదర్శి Dr. భార్గవి నెట్టం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పిల్లలకి పెద్దలకి ఆటలని నిర్వహించారు. తండ్రులతో పిల్లలు ఆడిన మూడు కాళ్ళ పరుగు అందరిలో ఉత్తేజం నింపింది.
 
 

 

ఫాథర్స్ డే సంధర్బంగా చివర్లో కేక్ కట్ చెయ్యడంతో పాటు వేసవి తాకిడిని ఎదుర్కోడానికి రోజంతా మజ్జిగ, పుచ్చకాయ ముక్కల్ని అందుబాటులో ఉంచారు.

 

ఈ కార్యక్రమంలో CAA అధ్యక్షురాలు Dr. ఉమ కటికి, ఉపాధ్యక్షులు పద్మారావు అప్పలనేని, కార్యదర్శి భార్గవి నెట్టం, ఫౌండర్స్ చైర్మన్ దినకర్ కారుమురి తో పాటు గత ఫౌండర్స్ సభ్యులు సుందర్ దిట్టకవి, శ్రీనివాస్ పెదమల్లు, రాఘవ జట్ల, రమేష్ గారపాటి సహా బోర్డు సభ్యుడు, సభ్యురాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం విశేషం.

 

 

చివరిలో అధ్యక్షురాలు ఉమ కటికి మాట్లాడుతూ ఈ వనభోజనాలని జయప్రదం చేసిన అతిథులకు, బోర్డు సభ్యులు, వాలంటీర్లకి ధన్యవాదాలు తెలిపారు. చికాగో వాసులని అలరించటానికి ఈ సంవత్సరం CAA ఇలాంటి మరెన్నో కార్యక్రమల్ని నిర్వహించబోతోంది అని, వాటన్నింటికి మనందరి మద్దతు కావాలి అని తెలిపారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;