EVENTS
బే ఏరియా ఉగాది సంబరాలు

 

అమెరికా కాలిఫోర్నియాలోని సన్నీవేల్ హిందూ దేవాలయంలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో ఉగాది సంబరాలను నిర్వహించారు. బాటా అధ్యక్షుడు కళ్యాణ్ కట్టమూరి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కథానాయకుడు నారా రోహిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘బాటా’ వార్షిక పత్రిక ‘తెలుగు వెలుగు’ను విడుదల చేశారు. మిమిక్రీ కళాకారులు రవి, రివర్స్ గేర్ గురుస్వామి తమ ప్రదర్శనలతో అలరించారు. నృత్యం, గానం, వ్యాస రచన, చదరంగం, సైన్స్ ఫేర్, ప్రత్యేక ప్రతిభ విభాగాలలో పోటీలు నిర్వహించారు. సుమారు మూడు వందల మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించిన అందరికీ కళ్యాణ్ కట్టమూరి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కోమటి జయరాం, అసూరి విజయ, ఉప్పల వీరు, మంగిన ప్రసాద్, వెలిగేటి కరుణ, కొండా రమేష్, వలంటీర్లు స్రవంతి, స్వాతి, అనంత, ఝాన్సీ, కళ్యాణి, ప్రియ, సురేష్, హరి, వినోద్, సోని, అపర్ణ, నీహారిక, మాధవి, స్నిగ్ధ, సుధ, పవిత్ర, జ్యోత్స్న, దీప్తి, పద్మ, గాయత్రి, నరేంద్ర, మూర్తి, లత, హరి, గిరి, శ్రీనివాస్, చిన్న, ప్రకాష్, సంతోష్, సాయి, దీపిక, నిత్య, వల్లి, కీర్తి, మనస్వి, సమత, మరియ, యుగంధర్, ఆశ, ఆదిత్య, ప్రదీప్, సమంత, అన్వేష్, లక్ష్మి, మురళి, సాయి, క్రాంతి, సందీప్, శ్రీనివాస్, వేద, గణేష్, వేణు, మనోజ్, దివ్య, మానస, తేజ, లాస్య, నమ్రత, అఖిల్, దీప్తి, షిప్ర, నిషా, లక్ష్మి, సుస్మి, రవళి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;