ARTICLES
అమెరికా తెలుగు కథానిక 13వ సంకలనం... ఆహ్వానం

 

అమెరికా తెలుగు కథానిక 13వ సంకలనం... ఆహ్వానం

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

www.vangurifoundation.org

www.vangurifoundation.blogspot.com

ఆహ్వానం - ప్రకటన - విజ్ఞప్తి

 

అమెరికా తెలుగు కథానిక - 13వ సంకలనం

(మా రాబోయే ప్రచురణ -2016)

1995 నుంచీ మేము ప్రచురిస్తున్న, తెలుగు సాహిత్య రంగంలో ప్రాచుర్యం పొందుతున్న అమెరికా తెలుగు కథానిక పరంపరలో 13వ సంకలనం 2016 సంవత్సరంలో వెలువడుతుంది. ఈ గ్రంధం సింగపూర్ లో జరగబోయే 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ప్రపంచవ్యాప్తం గానూ, రాజమండ్రిలో జరగబోయే జాతీయ సాహితీ సమ్మేళనంలోనూ, అమెరికాలో జరగబోయే 10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులలోనూ ఆవిష్కరించబడుతుంది. తద్వారా తెలుగు సాహిత్య ప్రపంచంలో అమెరికా కథా వికాసానికి  దోహదం చేస్తుంది అని ఆశిస్తున్నాం. 30 మంది అమెరికా రచయితల కథలతో గత 2014 లో ప్రచురించబడిన అమెరికా తెలుగు కథానిక – 12వ సంకలనం అశేష పాఠకాదరణ పొందిందిన సంగతి తెలిసినదే!

 

రాబోయే 13వ సంకలనంలో ప్రచురణార్ధం మీరు స్వయంగా రచించి, గత రెండు, మూడు సంవత్సరాలలో ఏదో ఒక మాధ్యమం (వ్రాత పత్రిక, అంతర్జాల పత్రిక, బ్లాగ్ వగైరా) లో ప్రచురించబడిన ఒకటి, రెండు మంచి కథలను మా పరిశీలనకు పంపించమని ఉత్తర అమెరికా కథకులను కోరుతున్నాం. అలాగే, సాహితీవేత్తలనూ, పాఠక మహాశయులనూ తాము చదివిన అమెరికా రచయితల కథలలో మంచివి మాకు పంపించి, లేదా సూచించి సహకరించమని కోరుతున్నాం. కథల కాపీ, మరియు తొలి ప్రచురణ వివరాలు కూడా మాకు తెలియపరచండి. కథల సేకరణ మరియు ఎంపిక విషయాలలో తమ సహకారాన్ని అందించమని పత్రికలూ, వెబ్ మేగజీన్ సంపాదకులూ, వ్యక్తిగత & ఇతర బ్లాగులూ, వెబ్ ప్రచురణలూ ఉన్న కథకులనూ, ప్రత్యేకంగా అర్ధిస్తున్నాం.

మీ కథలూ, కథా సూచనలూ మాకు చేరవలసిన ఆఖరి తేదీ: జూన్ 10, 2016.

 

Address to send entries

Soft copies by e-mail (PDF, Unicode Word or JPEG attachments only): 

vangurifoundaion@gmail.com and copy to sairacha@gmail.com

For any additional details, please contact any of the following:

                                                      Chitten Raju Vanguri (Phone: 832 594 9054) vangurifoundation@gmail.com

Sai Rachakonda, Hon. Editor: sairacha@gmail.com

TeluguOne For Your Business
About TeluguOne
;