EVENTS
నిత్య మలిశెట్టికి తానా యూత్ అవార్డ్

అందం, చదువు, కష్టపడే తత్త్వం, జ్ఞానం, మంచి మనసు, వినూత్నంగా ఆలోచించడం.. ఇలాంటి గొప్ప లక్షణాలన్నీ ఒక్కరిలోనే ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తే.. మిన్నెసోటా తెలుగు కమ్యూనిటీకి చెందిన 'నిత్య మలిశెట్టి'. అందుకే తనకి ప్రతిష్టాత్మక 'తానా యూత్ అవార్డు 2019' వరించింది.

ఆమె గ్రేడ్ 1 నుంచే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ వస్తోంది. వరల్డ్ జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్ మరియు సైన్స్ లలో అసాధారణమైన ప్రతిభ కనబరిచింది. జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో అనేక పోటీలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది.

నేషనల్ జియో బీ నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలో “నేషనల్ జియో బీ - 2013” 4-8 గ్రేడర్స్ విభాగంలో.. నిత్య 'గ్రేడ్ 4' లో ప్రథమ బహుమతి సాధించింది. వరల్డ్ జియోగ్రఫీలో తనకున్న జ్ఞానం మరియు ఆసక్తిని చాటుకుంది.

నిత్యకు మాథ్స్ లో మంచి నైపుణ్యం ఉంది. ఇప్పటివరకు అనేక పోటీల్లో ఆమె సాధించిన విజయాలే ఆమె మాథ్స్ స్కిల్స్ కి రుజువు. ఆమె గ్రేడ్ 1 లో ఉన్నప్పుడే “గిఫ్టెడ్ & టాలెంటెడ్ విజన్ -21” ప్రోగ్రామ్‌కు సెలెక్ట్ అయ్యి మొదటిసారి తన ప్రతిభ చాటుకుంది. మిన్నెసోటాలో నిర్వహించే “మాథ్స్ మాస్టర్స్” పోటీలలో ఆమె గ్రేడ్ 5 లో 5 వ స్థానంలో & గ్రేడ్ 6 లో 2 వ స్థానంలో నిలిచి ప్రతిభ చాటుకుంది. కాంటినెంటల్ మాథ్ లీగ్ లో మూడో స్థానంలో నిలిచింది. 6-8 గ్రేడ్ ల జాతీయ స్థాయి ప్రోగ్రాం అయిన మాథ్‌కౌంట్స్‌లో తన స్కూల్ కి ప్రాతినిధ్యం వహించడానికి నిత్యా ఎంపిక చేయబడింది. దీని కోసం స్కూల్స్ సాధారణంగా 8 వ తరగతి విద్యార్థులను ఎన్నుకుంటాయి. ఆమె గ్రేడ్ 6 లోనే 'యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా టాలెంటెడ్ యూత్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రాం (UMTYMP)' కు ఎంపికై కాలేజ్ ఆల్జీబ్రా 1 & ఆల్జీబ్రా 2 పూర్తి చేసింది. 2018 లో మిన్నెసోటాలో నిర్వహించిన 'మాథ్ కౌంట్' లో 'కౌంట్-డౌన్' రౌండ్లో చోటు దక్కించుకున్న ఏకైక దక్షిణాసియా విద్యార్థి నిత్య.

2014 లో, ఆమె గ్రేడ్ 5 లో ఉన్న సమయంలో.. డెస్టినేషన్ ఇమాజినేషన్ ఫైన్ ఆర్ట్స్ పోటీలో ప్రపంచంలో 15 వ స్థానంలో నిలిచింది.

ఇలా తక్కువ వయస్సులోనే ఎంతో ప్రతిభ చాటి అందరి మన్ననలు అందుకుంటున్న నిత్యకు.. తానా 2019 అవార్డుల కమిటీ చైర్మన్ గోపాల సీలమ్నేని & ప్రెసిడెంట్ సతీష్ వేమన 'తానా యూత్ అవార్డు 2019'ను ప్రకటించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;