ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయంటే..!
posted on Sep 3, 2024 9:30AM
గుడ్లు సమతుల ఆహారంలో భాగంగా పరిగణిస్తారు. ప్రతి రోజూ ఒక గుడ్డు తింటే పోషకాహార లోపం రాదని కూడా చెప్తారు. ఓ వయసు వచ్చాక పిల్లలకు గుడ్డు రోజూ ఇవ్వాలని వైద్యులు చెబుతారు. పిల్లలు, గర్భవతులు, మహిళలు, వృద్దులు ఇలా అందరికీ పోషకాలను సమకూర్చే పవర్ ఫుల్ ఫుడ్డు.. గుడ్డు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గుడ్లను ఉదయాన్నే తీసుకుంటే కలిగే లాభాల గురించి తెలిసిన వారు చాలా తక్కువ. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లో గుడ్లు తినడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటే..
గుడ్లు పరిమాణంలో చాలా చిన్నగా ఉన్నా పోషకాల పరంగా ఇవి చాలా బెస్ట్. ఇందులో విటమిన్-ఎ, బి5, బి12, డి, ఇ, కె, బి6, ఫూలేట్, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం, జింక్, ప్రోటీన్ తో పాటూ ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.
గుడ్లలో మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి ప్రోటీన్ ను బిల్డింగ్ చేయడంలో సహాయపడతాయి. శరీరం ప్రోటీన్ ను తయారు చేయలేదు కాబట్టి గుడ్లను తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్ కొరత ఏర్పడదు.
ట్రై గ్లిజరిడ్స్ రక్తంలో కనిపించే ఒక రకమైన కొవ్వు పదార్థం. శరీరంలో ట్రైగ్లిజరిడ్స్ ఎక్కువ ఉంటే గుండె జబ్బు ప్రమాదాలు పెరుగుతాయి. గుడ్లు తినడం వల్ల ఈ ట్రై గ్లిజరిడ్ స్థాయిలు తగ్గుతాయి.
రోజూ ఉదయాన్నే వారంలో కనీసం మూడు నుండి నాలుగు సార్లు అయినా గుడ్లు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని 75శాతం తగ్గించవచ్చు.
గుడ్లను ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది.
గుడ్లలో విటమిన్-ఎ, జింక్, జియాక్సంతిన్ వంటివి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. కార్నియా దెబ్బతినకుండా రక్షించే లక్షణాలు కూడా గుడ్లలో ఉంటాయి.
గుడ్లలో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులోని గ్రే మ్యాటర్ కు ముఖ్యమైనది. ఇందులో ఉండే కోలిన్ మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది.
గుడ్లలో తక్కువ కేలరీలు, నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. గుడ్లు తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇది జీవక్రియను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
*రూపశ్రీ.