ప్రశాంత్ కిశోర్‌ను కార్యకర్తలకు పరిచయం చేసిన జగన్
posted on Jul 9, 2017 3:19PM

గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు పార్టీ కార్యకర్తలను ఆశ్చర్యపరిచారు వైఎస్ జగన్..ఉదయం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తానని..ఒకరిని వేదిక మీదకు పిలిచారు. ఆయన ఎవరో కాదు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర వహించిన ప్రశాంత్ మనకు సహకారం అందించనున్నారని..అందరం కలిసికట్టుగా పని చేస్తే విజయం తథ్యమని ప్రశాంత్ కిశోర్‌ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు అభివాదం చేసిన ప్రశాంత్ తెలుగులో "నమస్తే" చెప్పడంతో ప్రాంగణమంతా చప్పట్లతో మారు మోగిపోయింది.