షర్మిల పాదయాత్ర ఫిబ్రవరి నుంచి ప్రారంభం

 

 

 

 

మోకాలి గాయంతో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను నిలిపేసిన జగన్ సోదరి వైఎస్ షర్మిల పిబ్రవరి లో పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తుందని సమాచారం. ఈ మేరకు ఆమెకు వైద్యం చేసిన వైద్యుడు శివభరత్ రెడ్డి ఈ విషయం వెల్లడించాడు. షర్మిల వేగంగా కోలుకుంటుందని, పిబ్రవరి మూడో వారంలో పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని అన్నారు. ఆరువారాల విశ్రాంతి పూర్తి కాగానే ఆమె మోకాలిని పరీక్షించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.


గాయం అయిన మొదటి రెండు రోజులు దాని తీవ్రతను గుర్తించలేకపోయామని, ఆ తరువాత గాయం తీవ్రత తెలిసి ఎమ్ ఆర్ ఐ స్కాన్ తీయడంతో గాయం తీవ్రత కనిపించిందని అన్నారు. అందుకే శస్త్రచికిత్స నిర్వహించామని, ప్రస్తుతం ఫిజియోథెరపీ నిపుణుల సాయంతో షర్మిల కోలుకుంటుందని అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు షర్మిల పాదయాత్ర మొదలవుతుందని, ఆ లోపు వైఎస్ జగన్ జైలు నుండి విడుదలయితే ఆయనే ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తారని అన్నారు.