పవన్ రావాలి, జగన్ పోవాలి... వైసీపీ విద్యార్ధి భేరీలో నినాదాలు

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయంలో ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంది. దీన్ని విపక్షాలు రాజకీయలబ్ధికోసమే ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నారని దుమ్మెత్తిపోస్తున్నాయి. మూడు రాజధానుల వల్ల ఉత్తరాంధ్ర కూడా ఎంతో అభవృద్ధి పొందగలదని ప్రభుత్వం చెబుతోంది. కానీ రియల్ఎస్టేట్ దందాను పెంచుకోవడానికి జగన్ తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారేగాని రాష్ట్ర ప్రయోజనాలపరంగా ఆలోచించడంలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే మూడు రాజధా నులే మంచిదని, వికేంద్రీకరణకు మద్దతుగా సోమవారం చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నాయక త్వంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ర్యాలి నిర్వహించారు. వైసీపీ ర్యాలిలో విద్యార్థు లు సీఎం జగన్ కు వ్యతిరేకంగాను, అధికారంలోకి  జనసేన  రావాలనీ  నినాదాలు చేయడం నాయకులకు నోట మాట రాలేదు,  ఒక దశలో విద్యార్థులు సీఎం పవర్ స్టార్ అంటూ భారీ నినాదాలు చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ ర్యాలీలో చోడవరం ఎమ్మెల్యే ధర్మ శ్రీ, అనకాపల్లి ఎంపీ సత్యవతి విశాఖ రాజధాని కోసం మాట్లాడారు. 

వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయడంలో ఆంతర్యం అన్ని ప్రాంతాలను సమానంగా చూడడం, అభవృద్ధి కూడా సమానంగా జరిగేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయంతోనే జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని ధర్మశ్రీ అన్నారు.  అమరావతిని రాజధానిగా ప్రజలంతా నమ్ముతున్నారని, అందుకే రైతులు తమ భూములను ఇచ్చారని ఇప్పుడు తన రాజకీయ లబ్ధి కోసం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు జగన్ తెచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి.  రాయలసీమ ప్రాంతీయులు జగన్ ఆలోచనను సమర్ధించారు. వారి ప్రాంతంలోని కర్పూలును లీగల్ క్యాపిటల్ గా  జగన్ పేర్కొన్నారు. కానీ  మూడు రాజధానులతో ఏ ప్రాంతానికి సమ న్యాయం జరిగే అవకాశం లేదని విపక్షాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్నారు.  టీడీపీ, జనసేన పార్టీ నేతలు విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా ఎన్నాళ్లు బానిసలుగా ఉండాలన్నారు. విశాఖ రాజధాని అయితే అందరికి ఉద్యోగాలు వస్తాయన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందన్నారు. 

కాగా, రాజధాని విషయంలో ప్రస్తుతం రెండు ఉద్యామాలు నడుస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించా ల్సిందేనంటూ ఆ ప్రాంత రైతాంగం చాలా రోజులుగా ఉద్యమిస్తున్నారు. అమరావతి నుంచి అరసవిల్లి వరకూ మహా పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో అందరి మద్దతును సంపాదించారు. ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం విశ్వయత్నాలు చేసి విఫలమయింది. వైసీపీ నేతల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. నల్ల బెలూన్లు లతో, మూడు రాజధానుల మద్దతుగా ఫ్లెక్సీలతో మూడు రాజధానుల మద్దతుదారులు, వైసీపీ నేతలు రైతుల పాదయాత్రకు నిరసన తెలుపుతున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జేఏసీ ఏర్పాటు చేశారు. ఈ జేఏసీ ఆందోళనలకు వైసీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. మూడు రాజధానులు కావాలని ఇటీవల విశాఖ గర్జన నిర్వహించారు.  ఇదిలా ఉండగా, మూడు రాజధానులకు మద్దతునిస్తూ విశాఖ జిల్లాలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల నాయకత్వంలో బైక్ ర్యాలీ చేపట్టారు. వికేంద్రీకరణతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సమ అభివృద్ధికి నోచుకుంటాయని నినాదాలు చేశారు. అంతేగాక మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా కి కూడా వెనుకాడటం లేదు. విశాఖ గర్జన విజయవంతమయిందని వైసీపీ నాయయకులు, కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. కాగా ఇటీవల తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన నిర్వహించడం గమనార్హం. తమప్రాంతానికి రాజధాని తేవాలని మూడురాజధానుల యోచనకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భారీ ర్యాలీ కూడా చేపట్టారు.