హైకోర్టులో శ్యామల క్వాష్ పిటిషన్
posted on Mar 21, 2025 10:33AM

వైసీపీ అధికార ప్రతినిథి, యాంకర్ శ్యామల హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ ఆమె హై కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం (మార్చి 21) విచారణ జరుపుతుంది. నిబంధనలకు తిలోదకాలిచ్చి, చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
అలా కేసు నమోదైన వారిలో వైసీపీ అధికార ప్రతినిథి శ్యామల కూడా ఉన్నారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ శ్యామల కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయ్యింది. పంజాగుట్ట పోలీసుల నుంచి కేసు వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వెనుక ఎవరున్నారు? ఎంతెంత డబ్బు, ఎవరెవరి ఖాతాల్లోకి చేరింది? ఎన్ని చేతులు మారింది అన్న వివరాలు కూపీలాగుతున్నట్లు తెలియవచ్చింది. ఇక ఈ కేసులో శ్యామల భర్త పాత్ర ఉందా అన్న కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే శ్యామల ఆస్తులు, లావాదేవీల గురించి కూడా ఈడీ ఆరా తీస్తోందంటున్నారు.