గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో.. ఎదురుదాడితో వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్
posted on Aug 19, 2022 11:26AM
వివరణ ఇవ్వలేనప్పుడు ఎదురుదాడే బెటర్ అన్న పంథాను వైసీపీ అనుసరిస్తోంది. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో వైసీపీ ఇదే పంథాను అనుసరిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియో బయటపడినప్పటి నుంచీ వైసీపీ తీరు, ఆ పార్టీ నాయకులు ఆ అంశంపై స్పందిస్తున్న తీరు అన్నీ అయోమయంగానే ఉన్నాయి.
అయినదానికీ కానిదానికీ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి గోరంట్ల మాధవ్ విషయంలో కనీసం స్పందించకపోవడం, పార్టీ పరువు నిలువునా బజారున పడుతున్నా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ నోరు మెదపక పోవడం చూస్తుంటే.. మాధవ్ నగ్న వీడియో కాల్ విషయంలో ఆ పార్టీ ఎంతగా డిఫెన్స్ లో పడిందో అర్ధమౌతోంది. వారాల తరబడిగా ఆ నగ్న వీడియో కాల్ విషయంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. ఏకంగా లోక్ సభ స్పీకర్ కు సైతం ఫిర్యాదు అందింది. జాతీయ మహిళా కమిషన్ దర్యాప్తునకు ఆదేశించింది.
అయినా వైసీపీ మాత్రం గోరంట్లను కాపాడేందుకు ప్రయత్నాలుచ చేస్తూనే ఉంది. ముఖ్యంగా పోలీసుల అండతో బయట పడాలన్న తాపత్రయం ప్రదర్శిస్తున్నది. తొలుత ఆ వీడియో ఫేకో కాదో నిరూపించడం అసాధ్యం అని అనంతపురం ఎస్పీ చెబితే.. తెలుగుదేవం అమెరికాలో ఫోరెన్సిక్ ల్యాబ్ అది ఒరిజనలే అంటూ ఇచ్చిన సర్టిఫికేట్ ను చూపి ఇప్పుడేమంటారని నిలదీసింది. దానికి ఖండించడానికి కూడా మళ్లీ వైసీపీ పోలీసులనే అశ్రయించింది. అమెరికాలోని ప్రైవేట్ పోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ అంటూ తెలుగుదేశం నాకుడు పట్టాభి బయట పెట్టిన నివేదికే ఫేక్ అని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పడం వైసీపీ ఈ విషయంలో ఆత్మరక్షణ కోసం ఎంతగా ప్రయత్నిస్తోందో అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.
గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ కు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో బయటపెడతామని, అమెరికాలోని ప్రైవేట్ పోరెన్సిక్ ల్యాబ్ నివేదిక సరికాదంటూ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పడం సరికాదనీ పట్టాభి అంటున్నారు. తాము స్టాఫోర్డ్ కి పంపిన ఈ మెయిల్స్ అధారాలు ఉన్నాయని పట్టాభి అంటున్నారు. సీబీఐకి తప్పు చేసిన అధికార పార్టీ నాయకులను వెనకేసుకు రావడం మీద ఉన్న శ్రద్ధ, రాష్ట్రంలో మహిళల భద్రతపై ఉండి ఉంటే బాగుంటుందని పట్టాభి పేర్కొన్నారు. మద్రాస్ ఐ ఐ టి నివేదికని ఫోర్జరీ చేసిన ఘనత రాష్ట్ర అధికార పార్టీది అని ఎద్దేవా చేసారు. గోరంట్ల మాధవ్ విషయం లో అన్నిరకాల ఆధారాలు బయటపెట్టిన తమ పైనే కేసు లు పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మాధవ్ న్యూడ్ వీడియో సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాలని డిమాండ్ చేసారు.