వైసీపీ, బీజేపీ మధ్య బంధం ఇక బయటపడుతుందా...

గత ఎన్నికలలో వైసీపీ విజయానికి పరోక్షంగా బీజేపీ సహకరించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కొంత మంది రాష్ట్ర బీజేపీ నాయకులు ఎన్నికల తరువాత ఇన్ డైరెక్ట్ గా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు. తరువాత బీజేపీ, వైసీపీ నేతల మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధాలు నడిచాయి.  ఐతే సీఎం జగన్ మాత్రం బీజేపీ కేంద్ర నాయకత్వాన్నీ ధిక్కరించే ధోరణి తో కాక వారికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు.

ఐతే వైసీపీలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ బంధం పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. అసలు విషయం ఏంటంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ఈ రోజు స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేసారు. మరో పక్క రఘరామ రాజు బీజేపీ లో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా అయన పై అనర్హత వేటు వేసి తమ పార్టీలో అసమ్మతి కి వాయిస్ లేకుండా చేయాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయం లో అటు రఘు రామ రాజు అసలు వైసీపీ పార్టీ వైఎస్ఆర్ పేరు ఎలా వాడుకుంటుంది అని ప్రశ్నిస్తూ ఎన్నికల సంఘాన్ని కూడా కలిశారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం లోని అధినాయకత్వం ఎటు వైపు నిలబడుతుందో అని విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంతకూ కేంద్రం లోని పెద్దలు ఈ విషయంలో కలగచేసుకుంటారా లేక కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా వ్యవహరిస్తారో వేచి చూడాలి.