వైసీపీ ఫ్రాడ్ బ్రాండ్స్!
posted on Dec 1, 2025 1:26PM

వైసీపీ ఒక క్రిమినల్ గ్యాంగ్ అని చెప్పడానికి ఇప్పటికే ఆ పార్టీ అధినేత నుంచి రప్పా రప్పా ఫ్లెక్సీలు పట్టుకు తిరిగే కేడర్ వరకూ అందరూ ముంజేతి కంకణానికి అద్దం ఎందుకన్న రీతిలో రుజువు చేసేశారు. జగన్ ఆస్తుల కేసులలో, ఆ పార్టీ నేతలు ఏపీ మద్యంస్కాం, కల్తీమద్యం కుంభకోణం, భూ కబ్జాలు వంటి ఎన్నో నేరాలలో కేసులను ఎదుర్కొంటున్నారు. కొందరు కటకటాల వెనుక ఉన్నారు. ఇది చాలు ఆ పార్టీ ఒక క్రిమినల్స్ గ్యాంగ్ అని చెప్పడానికి అంటున్నారు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. ఇప్పుడు తాజాగా వైసీపీలో లేడీ డాన్స్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వస్తోందంటున్నారు. మొన్నటికి మొన్న నెల్లూరు లేడీ డాన్ అరుణ వ్యవహారం. ఇప్పుడు తాజాగా అదే నెల్లూరు జిల్లాకు, చెందిన అరవ కామాక్షి కేసు. అరవ కామాక్షి అయితే ఏకంగా గంజాయి దందా నిర్వహిస్తూన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
అరవ కామాక్షి చేసే గంజాయి దందాను అరికట్టాలని పోరాటం చేస్తున్న పెంచలయ్య అనే వ్యక్తిని వెంటాడి, వేటాడి మరీ హత్య చేసింది కామాక్షి గ్యాంగ్ అని పెంచలయ్య హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెబుతున్నారు. తన గంజాయి దందాకు పెంచలయ్య ఆడ్డు వస్తున్నాడన్న కారణంగా అతడ్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్న కామాక్షి గ్యాంగ్ చివరకు పెంచలయ్య తన బిడ్డను స్కూలు నుంచి తీసుకొస్తుండగా కాపు కాచి మరీ ఖతం చేశారని చెబుతున్నారు.
ఈ హత్య ఘటనను కూడా వైసీపీయులు రాజకీయ ప్రత్యర్థులపై నెట్టేయడానికి ప్రయత్నించారు. దీనిపై రియాక్టైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒక వేళ నాపై సీపీఏం నేతలు కేసు పెడితే తాను వారు విధించే శిక్షను ఎదుర్కుంటానన్నారు. వాస్తవానికి అరవ కామాక్షికి ఆనం విజయ్ కుమార్ రెడ్డి వర్గానికి ఎంతో సంబంధముందని ఆరోపించారాయన. ఇటీవల జగన్ నెల్లూరు వచ్చినపుడు ఇదే అరవ కామాక్షి ఐదు లక్షల రూపాయలు ఖర్చుల కోసం ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆమెకూ వైసీపీ నేతలకు అంతటి సంబంధ బాంధవ్యాలున్నాయి కనుకే.. విజయ్ కుమార్ రెడ్డి, పెంచలయ్య కుటుంబాన్ని పరమార్శించడానికి రాలేదన్నారు కోటంరెడ్డి.
ఇదంతా ఇలా ఉంటే వైసీపీ ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడే గ్యాంగ్ ను తయారు చేసిందనీ, అది చాలదన్నట్లు ఇప్పుడు ఒక అరుణ, ఒక అరవ కామాక్షి వంటి ఫ్రాడ్ బ్రాండ్స్ ని కూడా రంగంలోకి దింపిందనీ విమర్శించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.