బొత్స.. అక్కడ కింగ్.. ఇక్కడ?

బొత్స సత్యనారాయణ కాంగ్రస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి.. ఆ పార్టీ వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషించి కింగ్ లా ఓ చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పార్టీ మారిన తరువాత సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే బొత్స కాంగ్రెస్ ను వీడి వైకాపాలోకి రావడానికి ముందే జగన్ కు, బొత్సకు కొన్ని ఒప్పందాలు జరిగాయట. అయితే పార్టీలోకి మారిన తరువాత జగన్ ఇప్పుడు వాటిని విస్మరిస్తున్నారని బొత్స ఫీలవుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వైకాపాలోకి చేరిన కొత్తలో బొత్స బాగానే హడావుడి చేశారు. పార్టీలోకి చేరిన కొద్ది రోజుల్లోనే బొత్స ఏది చెబితే అది చేసేవారు జగన్ కూడా. దీంతో ఆయన హడావుడితో పార్టీలో ఉన్న నేతలు సైతం ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడే అనుకున్నారు కూడా. అయితే అదంతా కొద్ది రోజుల వరకే అన్న సత్యం తెలుసుకోలేకపోయాడు బొత్స. ఉత్తరాంధ్రలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం తానే చూసుకోవాలని.. అంతేకాదు  కోస్తాంధ్ర‌లోనూ కూడా తన పెత్త‌నమే ఉండాలని ఆశించార‌ట‌ బొత్స.. జగన్ అంత ఛాన్స్ ఇస్తాడా.. జ‌గ‌న్ త‌న త‌రువాత ఏ ఒక్క లీడ‌ర్నీ ఆ.. స్థాయిలోకి రానివ్వ‌డంలేద‌ట...

అంతేకాదు ఇక పార్టీలో ఉన్న పాత రెడ్లు.. కొత్త కాపుల నుంచి చుక్కెదుర‌వుతోంద‌ట‌. దీంతో బొత్స అనవసరంగా  పార్టీ మారి దెబ్బైపోయామే అని వాపోతున్నారట. పాపం ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని మనిషిగా పేరు తెచ్చుకొన్న బొత్సకు ఇప్పుడు జగన్ రూపంలో ఝలక్ తగిలే సరికి తట్టుకోలేకపోతున్నారు. సొంత సోదరి విషయంలోనే ఖాతరు చేయని జగన్ అంత తేలిగ్గా నేతలను ఎదగనిస్తాడా.. ఇప్పుడు బొత్స విషయంలో కూడా అదే జరిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu