వైసీపీ మటాష్ అయిపోవడం ఖాయం.. రైస్ సర్వే
posted on Apr 15, 2024 6:27AM
ప్రజాభిప్రాయాన్ని సేకరించడంలో విశ్వసనీయత వున్న ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ (రైస్ ) అనే సంస్థ ఈ ఎన్నికలలో ఎవరి బలం ఎలా వుండబోతోందో అంచనాలను రూపొందించింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఈసారి ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ తన అధికారాన్ని కోల్పోబోతోంది. ఈనెల 13వ తేదీ నాటి పరిస్థితుల ప్రకారం చేసిన సర్వే అంచనాలివి. ‘రైస్’ సర్వే అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 107 నుంచి 114 స్థానాలను గెలుచుకోబోతోంది. వైసీపీకి 55 నుంచి 68 స్థానాల వరకు వచ్చే అవకాశం వుంది.
పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, చీపురుపల్లి, గజపతినగరం, పార్వతీపురం, రురుపాం, సాలూరు, అరకు, పాడేరు, విశాఖ సౌత్, అనపర్తి, రామచంద్రాపురం, ఉంగుటూరు, పోలవరం, నరసరావుపేట, బాపట్ల, ఎర్రగొండపాలెం, దర్శి, ఉదయగిరి, సర్వేపల్లి, సూళ్ళూరుపేట, గూడురు, సత్యవేడు, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, రాజంపేట, కోడూరు, రాయచోటి, పుంగనూరు, బద్వేల్, కమలాపరం, పులివెందుల, ఆళ్ళగడ్డ, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, కోడుమూరు, ఆదోని, గుంతకల్, కళ్యాణదుర్గం, మడకశిర స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశాలు వున్నాయని ‘రైస్’ సర్వే పేర్కొంది.