కుప్పం వైకాపా అభ్యర్థి భరత్ అనవసరపు ఆత్రం
posted on May 13, 2024 3:56PM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో విజయం వన్‌సైడ్ అని అందరికీ తెలిసిన విషయమే. కుప్పం ప్రజలు ఎప్పుడూ చంద్రబాబు వైపే వుంటారు. అయితే ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేస్తున్న భరత్ అనవసరపు ఆత్రం ప్రదర్శిస్తూ హడావిడి చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని పలు కేంద్రాల్లో వైకాపా గూండాలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లను బెదిరిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి భరత్ స్వయంగా రంగంలోకి దిగి తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు. భరత్ సింగసముద్రంలోని పోలింగ్ బూత్‌కు వెళ్లి తలుపులు మూసేశారు. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతిఘటించడంతో భరత్ తలుపులు తెరిచారు.