చైనా మనకు స్ఫూర్తి.. యనమల
posted on Jan 12, 2016 10:54AM

అభివృద్ధిలో చైనా మనకు స్ఫూర్తి అని ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్నసీఐఐ సదస్సు మూడోరోజు సందర్భంగా యనమల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తాయి.. ఏపీ అభివృద్దికి పారిశ్రామికవేత్తలు తోడ్పాటు అందించాలని కోరారు. అంతేకాదు భారీ పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, మైనింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంధన, తయారీ, రిటైల్, సీఆర్‌డీఏ, గృహ నిర్మాణ, మౌలిక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు ముందుకొచ్చాయి.. యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.