బస్సులో చంద్రబాబు నిద్ర.. సీక్రెట్ ఏంటీ..?
posted on Jan 12, 2016 11:22AM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో నిర్వహిస్తున్న ఐసీసీ సదస్సులో పాల్గొంటున్న సంగతి తెలసిందే. ఈ సదస్సు ద్వారా ఎంతోమంది పెట్టిబడిదారులు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నారు. అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా.. ఈ సదస్సు సందర్బంగా చంద్రబాబు చేస్తున్న ఒక పని గురించి మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. అదేంటంటే పెట్టుబడులు ఆకర్షించేందుకు విశాఖ నగరిలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు వైజాగ్ వచ్చిన బాబు.. గవర్నర్ బంగ్లా ఆవరణలో బస్సులో నిద్రపోవటం. దీనిపై పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబుపై ఖర్చులు ఎక్కువగా చేస్తున్నారని.. తన ప్రయాణాల నిమిత్తమైతేనేమి.. తన ఇల్లు... ఆఫీసు నిమిత్తమైతేనేమి ఎన్నో విమర్శలు చవిచూశారు. అందుకే ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు. మరోవైపు ఈ సదస్సుకు వచ్చిన పారిశ్రామివేత్తల దృష్టిని ఆకర్షించడానికి ఇలా చేస్తున్నారని.. దీని ద్వారా ఏపీ కోసం ఎంత కష్టపడుతున్నారన్న సంకేతాలు పంపినట్టు అవుతుందని ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు. ఇలా ఉంటే బాబు ఇలా చేయడం వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బ తీసేలా ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి బాబు నిద్ర వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో బాబుకే తెలియాలి.