గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
posted on Jan 3, 2026 9:43AM

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరు లో శనివారం (జనవరి 3) ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీ వరకూ మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రపంచ తెలుగు మహాసభలలో తెలుగు భాషకు సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
తెలుగు ప్రపంచ మహా సభలకు దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది తెలుగు భాషాభిమానులు, విద్యావేత్తలూ తరలి వస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు శనివారం (జనవరి 3) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాస కల్యాణంలో ప్రపంచ తెలుగు మహా సభలకు అంకురార్పణ జరిగింది.
మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, సన్మానాలతో పాటు తెలుగు చలన చిత్ర గీతాలాపనలు జరగనున్నాయి. ఇక ప్రపంచ తెలుగుమహాసభల ముగింపు కార్యక్రమం సోమవారం ( జనవరి 5) జరగనుంది. ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొంటారు.