వైఎస్ జగన్ కాన్వాయ్ కు అడ్డుపడిన మహిళ

 

వైసీపీ అధినేత, కాబోయే సీఎం జగన్‌ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అల్పాహారం తీసుకున్న తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. ఆసమయంలో పద్మావతి అతిథిగృహం వద్ద జగన్‌ కాన్వాయ్‌కు ఓ మహిళ అడ్డుపడింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తన భర్తకు ఉద్యోగం కావాలంటూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మహిళ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను పక్కకు లాగారు. ఆ పెనుగులాటలో మహిళ చేతికి స్వల్పగాయమైంది. ఇది గమనించిన జగన్‌ వాహనం ఆపి వెంటనే ఆమెను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడి.. ఆమెకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu