పసిబిడ్డతో సహా కాలువలో దూకిన మహిళ

 

ఒక మహిళ తన బిడ్డతో సహా కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కర్నూలులోని కేసీ కాలువ వద్ద ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ సంవత్సరం వయసున్న తన కుమార్తెని తన నడుముకు కట్టుకుని అందరూ చూస్తుండగానే కేసీ కెనాల్‌లో దూకేసింది. కేసీ కెనాల్‌లో నీటి ప్రవాహం చాలా ఉద్ధృతంగా ఉండటంతో ఆమె తన బిడ్డతో సహా నీటిలో కొట్టుకుపోయింది. పోలీసులు గజ ఈతగాళ్ళని పిలిపించి మృతదేహాలను బయటకి తీశారు. కుటుంబ సమస్యల కారణంగానే ఈ మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.