కోలుకోగానే తెనాలి వెళ్తా: పవన్ కళ్యాణ్ 

జనసేనాని పవన్ కల్యాణ్ అస్వస్థతతో బాధపడుతూనే నిన్న పిఠాపురం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగారు. దాంతో, ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో చికిత్స కోసం పిఠాపురం నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. వాస్తవానికి పవన్ ఇవాళ తెనాలిలో  వారాహి విజయభేరి సభలో పాల్గొనాల్సి ఉంది. ఆయన హైదరాబాద్ వెళ్లిపోవడంతో ఈ సభ వాయిదా పడింది. 
పవన్ ఆరోగ్యం పట్ల అభిమానుల్లోనూ, జనసేన పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 
అస్వస్థతకు గురికావడం వల్ల తెనాలిలో నిర్వహించవలసిన వారాహి యాత్ర, సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తెనాలి విచ్చేసి, వారాహి సభలో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu