కరోనా వృషణాల్లో తిష్టవేసి స్పెర్మ్ కౌంట్ పై దాడి!
posted on Apr 21, 2020 2:01PM
కరోనా వైరస్ మహిళల కంటే పురుషులకే అత్యధికంగా వ్యాపిస్తుందని తేలింది. ఇదే క్రమంలో పురుషులకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. పురుషుల్లో వృద్ధుల కంటే యువకులకు కరోనా వైరస్ వ్యాపించే అవకాశం అధికంగా ఉందని తాజాగా ఓ పరిశోధన చెబుతోంది. కరోనా వైరస్ వల్ల అత్యధిక ముప్పు పురుషులకే సోకడానికి కారణమేమిటంటే పురుషులలో ఉండే వృషణాలేనని తేలింది.
కరోనా వైరస్ పురుషుల శరీరంలో ఉండే ఊపిరితిత్తులు పేగులు గుండెతోపాటు వృషణాల్లో కూడా ఆ వైరస్ తిష్ట వేస్తుంది. ఆయా అవయవాల్లో ఉండే ACE2 ప్రోటీన్లతో బంధాన్ని ఏర్పరుచుకుని ఆ వైరస్ అక్కడే ఉండిపోతుంది. ఈ ప్రోటీన్లు వృషణాల్లోని అండాశయ కణజాలంలో చాలా తక్కువగా ఉండడంతో వైరస్ అక్కడి నుంచి కదలదని ఆ అధ్యయనంలో తేలింది. ఈ కారణంగా కరోనా వైరస్ వచ్చిన పురుషులు కోలుకోవడానికి అధిక సమయం పడుతుంది.
మహిళలు 4 రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకుంటున్నారు. అయితే పురుషులు కోలుకోవడానికి ఆరు రోజుల కంటే ఎక్కువ సమయం పడుతోంది. పురుషుల కంటే స్త్రీలలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని ఈ కారణంతో వారు త్వరగా కోలుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు.
కరోనా వైరస్ సోకిన పురుషులకు భవిష్యత్‌లో సంతాన కలగడం పెద్ద సమస్యగా మారుతుంది. వీర్య ఉత్పత్తిపై చెడు ప్రభావం చూపి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.