మోడీ చెబుతున్న న్యూ ఇండియా పయనమెటు?

వైబ్రెంట్ గుజరాత్ అంటూ భారీ ప్రచారంతో ఒక్క సారిగా ముఖ్యమంత్రి నుంచి ప్రధాన మంత్రి పదవికి ప్రమోషన్ పొందిన నరేంద్ర మోడీ.. ఇప్పటికీ భారత దేశానికి తాని తాను నిర్దేశిస్తున్న మోడల్ గుజరాత్ అనే చెబుతుంటారు. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని దాకా తన ప్రస్తానంలో సహకరించిన స్వరాష్ట్ర అధికారులు, నేతలనెవరినీ ఆయన మరచిపోలేదు.

దేశంలోని ఏ  కీలక ప్రభుత్వ శాఖ, ఏ ప్రభుత్వ సంస్థ అధిపతులను తీసుకున్నా వారంతా గుజరాత్ కు చెందిన వారే అనడంలో సందేహాలకు తావివ్వని విధంగా మోడీ జాగ్రత్త పడ్డారు. ఇంతకీ అసలు ఆ వైబ్రెంట్ గుజరాత్ లో ఏం జరుగుతోంది. మోడీ ఎక్కడకు వెళ్లినా.. ఎందు కాలిడినా పొగిడేది గుజరాత్ ను గుజరాత్ సంస్కృతినే. ఇప్పటికీ ఆయన వ్యతిరేకులు మోడీ భారత ప్రధాని అయినా ఆయన తీరు మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రి అన్నట్లుగానే ఉంటుందని ఎద్దేవా చేస్తుంటారు. అందుకు ఉదాహరణగా కేటాయింపుల్లోనూ, నియామకాల్లోనూ, బడ్జెట్ లోనూ గుజరాత్ కు ఆయన అగ్రతాంబూలం ఇవ్వడాన్ని ఎత్తి చూపుతుంటారు. మోడీ భారత్ కే మోడల్ గా చెబుతున్న గుజరాత్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయనడానికి మచ్చుతునకగా ఇటీవల ఆ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓ ఘోర ఉదంతాన్ని చెప్పుకోక తప్పదు. 

మన దేశంలో సతీ సహగమనం దురాచారాన్ని 1829లో రద్దు చేశారు. బెంగాల్ పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా గుర్తింపు పొందని రాజా రామ్ మోహన్ రాయ్ సతీ సహగమనానినికి వ్యతిరేకంగా చేసిన ఆందోళన ఫలించి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ రద్దు చేశారు.

అయితే ఆ దురాచారం మళ్లీ గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది. శతాబ్దాల కిందట అంతరించిపోయిన సతీ సహగమనం ( భర్త చనిపోతే ఆ చితిపైనే  ఆత్మాహుతి చేసుకోవడం) గుజరాత్ లో  బలవంతంగా అమలు చేయబోతే ప్రతిఘటించీ ఫలితం లేని ఓ అబల శబర్మతి నదిలో దూకి తనువు చాలించింది. 28 ఏళ్ల ఓ హిందూ యువతి భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. అత్తింటి వారు ఆమెను  సతీసహగమనం చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో  శబర్మతి నదిలో దూకి తనువు చాలించింది. ఇంతకీ మోడీ చెబుతున్న న్యూ ఇండియా ఎటువైపు సాగుతున్నట్లు? మోడీ గుజరాత్ మోడల్ .. భారత దేశాన్ని ఏ నాగరికత వైపు తీసుకు వెడుతున్నట్లు?