భవిష్యత్ లో భూగోళం

2030లో కృత్రిమ రక్తం ఉత్పత్తి

 

2040లో వాణిజ్యవనరుగా అణుశక్తి

 

2050లో మూన్ టూర్ ఫర్ కామన్ మ్యాన్

 

ప్రపంచం రేపు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతిఒక్కరిలో ఉంటుంది. అందుకే 2050 వరకు అంటే మరో మూడుదశాబ్దాల్లో ఈ భూగోళంపై మానవ జీవితంలో వచ్చే మార్పులను ఇలా అంచనా వేస్తున్నారు. మరి ఆ మార్పులేంటో దశాబ్దాల వారీగా మనం తెలుసుకుందామా..

 

2030 నాటికీ అంటే రానున్న దశాబ్ద కాలంలో వచ్చే మార్పులు..

- జర్మనీ పెట్రోల్ డీజిన్ తదితర ఇంధనాలపై నడిచే కార్ల అమ్మకాన్ని పూర్తిగా నిషేధిస్తుంది.

- భూమిపై అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం మారనుంది.

- పక్షవాతం వచ్చిన రోగుల్లో వారి అవయవాలను మెరుగుపరచడానికి నరాలను శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు.

- మూలకణాల నుంచి అంటే స్టెమ్ సెల్స్ నుంచి ఉత్పత్తి చేయబడిన కృత్రిమ రక్తం మార్కెట్‌ లో లభిస్తోంది.

- సోలార్ ప్యానల్ ధర ప్రతి వాట్ 0.5 డాలర్లు సమానంగా అవుతుంది.

- ప్రపంచవ్యాప్తంగా 13,166,667 ఎలెక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతాయి.

- డయాబెటిస్ టైప్ 2 ను అదుపు చేయడానికి ప్రోటీన్ ఇంజెక్షన్లను ఉపయోగిస్తారు

- శాస్త్రవేత్తలు ఫ్లూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తారు, ఇది అన్ని జాతుల నుండి రక్షిస్తుంది.

- ప్రపంచ జనాభా 8,500,766,000 కు చేరుకుంటుందని అంచనా

- అవయవాల తయారీలో 3డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు

- వచ్చే దశాబ్దంలో అంగారక గ్రహం పైకి వెళ్లడానికి మానవాళి సిద్ధమవుతుంది

 

2040లో

- ఫుడ్ రెప్లికేటర్లు మీ పోషక స్థాయి ప్రకారం భోజనాన్ని డిజైన్ చేస్తాయి

- ప్రపంచ జనాభా 9,157,230,000 కు చేరుకుంటుంది.

- ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెంది భారతదేశం అమెరికాను అధిగమిస్తుంది.

- ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన పరికరాల సంఖ్య 173,987,427,000 కి చేరుతుంది.

- ప్రతి ఒక్కరికీ 19 పరికరాలు అవసరం అవుతాయి. అందుబాటులో ఉంటాయి

- తూర్పు మధ్య, ఆఫ్రికా ఖండంలో కొంత భాగంలో ఉష్టోగ్రతలు విపరీతంగా పెరిగి నివసించడానికి అననుకూలమైన వాతావరణంలో ఉంటాయి.

- వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా సామూహిక వలసలు పెరుగుతాయి.

- ప్రపంచంలోని మొట్టమొదటి స్పేస్ ఎలివేటర్ ను పూర్తి చేసే స్థాయిలో జపాన్ ఉంటుంది.  

- అణుశక్తి వాణిజ్యవనరుగా మారుతుంది.

- క్వాంటం కంప్యూటింగ్ చిప్స్ కారణంగా గతంలో కంటే వేగంగా యంత్రాలు పనిచేస్తాయి.

- ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాల నుండి వనరులను సేకరించడం పెరుగుతుంది.

- వాతావరణంలో మార్పులు, పరిమిత వనరుల కారణంగా ఆహార కొరత ఏర్పడుతుంది. 

- యువతలో అల్జీమర్స్ వ్యాధి కేసులు పెరుగుతాయి.

- టెలివిజన్ మాయమై ఆన్ లైన్ వీడియో, మీడియా పెరుగుతాయి.

- ప్రపంచవ్యాప్తంగా పొగాకు నియంత్రిస్తారు.

- నాసా జలాంతర్గామి సాటర్న్ ఉపగ్రహం టైటాన్లో గ్రహాంతర జీవుల కోసం అన్వేషిస్తుంది

- స్పేస్‌ ఎక్స్  తన స్పేర్ షిప్ లో మార్స్ కు మనషులను తీసుకువెళ్లుతుంది.

- మనిషి మెదడును రోబోట్ లోకి పంపించే కొత్త టెక్నాలజీ  క్లినికల్ ట్రయల్ జరుగుతాయి.

 

2050

- జనటిక్ ఇంజనీరింగ్ ద్వారా బిడ్డను కనాలనుకుంటే డబ్బులను చెల్లించాల్సిందే.

- మానవ భావోద్వేగాలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీకి అనుసంధానం చేయవచ్చు.

- న్యూరోటెక్నాలజీని ఉపయోగించి ఇతర వ్యక్తులతో సంభాషించడానికి వీలు కలుగుతుంది.

- వివిధ రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా యూనివర్సల్ టీకా ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది.

- ప్రపంచ జనాభా సుమారు 10,143,271,720కు చేరుతుంది.

- 5 బిలియన్ ప్రజలు ఇప్పుడు నీటి ఎద్దడి ప్రాంతాల్లో నివసిస్తారు

- ప్రపంచ జనాభాలో సగం మంది దృష్టి లోపంతో ఉంటారు. 

- ప్రపంచ ఉష్ణోగ్రత సగటు 37.4 సెల్సియల్ డిగ్రీలుగా ఉంటుంది.

- ధ్రువ ఎలుగుబంట్లు అంతరించిపోతాయి.

- అత్యంత ఆధునికంగా పనిచేసే అవయవాలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావడంతో చాలామంది తమ అవయవాల
స్థానంలో వాటిని ఏర్పాటుచేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.

- ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన పరికరాల 237,500,000,000 కు చేరుకుంటుంది

- ప్రతి వినియోగదారుడు ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన 25 పరికరాలను కలిగి ఉంటారు.

- ఎలక్ట్రిక్, ఆధునిక కార్లు మాత్రమే యుకె, జర్మనీ, ఇండియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లో అమ్ముడవుతాయి

- బహుళ అంతస్తుల హైటెక్ భవనాల సంఖ్య పెరిగి పట్టణాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి.

- మన మహాసముద్రాలలో చేపల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉంటుంది.

- సుదూర ప్లానెట్ల చిత్రాలను కూడా తీయగలిగిన అధిక రిజల్యూషన్ కెమెరాలు అందుబాటులోకి వస్తాయి.

- చంద్రునికి టూర్ వెళ్లడం సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తుంది.

- మార్స్ మీద శాశ్వతంగా నివాసం ఏర్పర్చుకునే వీలు కలుగుతుంది.

- మన జ్ఞాపకాలను కంప్యూటర్లలోకి అప్‌లోడ్ చేయవచ్చు. వాటిని డిజిటల్‌గా సేవ్ చేయవచ్చు.