బోసడీకే అంటే అర్థం తెలుసా? బూతా? కాదా?

బోసడీకే. ఏపీలో ట్రెండింగ్ ప‌దం. కొంద‌రికి ఈ ప‌దం పాత‌దే అయినా.. చాలామందికి ఈ ప‌దం ఇప్పుడే తెలిసింది. టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి.. సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి బోసిడీకే అనే ప‌దాన్ని వాడటం.. అది ర‌చ్చ ర‌చ్చ‌కు దారి తీయ‌డం.. ఏపీలో తీవ్ర ఉద్రిక్త‌త‌ను రాజేసింది. వైసీపీ రౌడీ మూక‌లు.. టీడీపీ కార్యాల‌యాల‌పై ప‌డి విధ్వంసం సృష్టించారు. క‌ట్ చేస్తే.. వైసీపీ దాడుల‌ను సీఎం జ‌గ‌న్ స‌మ‌ర్థించ‌డం, ప‌లువురు మంత్రులు మ‌ళ్లీ టీడీపీనే బెదిరించ‌డం.. పోలీసులు సైతం ఏకంగా నారా లోకేశ్‌తో పాటు ప‌లువురు నాయ‌కుల‌పై హత్యాయ‌త్నం, అట్రాసిటీ కేసులు న‌మోదు చేయ‌డం.. చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష‌కు దిగుతుండ‌టం.. రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను డిమాండ్ చేయ‌డం.. ఇలా ఏపీ రాజ‌కీయాలు రావ‌ణ‌కాష్టంలా ర‌గులుతున్నాయి. ఇంత‌టి ర‌చ్చ రంభోలాకు కార‌ణం.. ప‌ట్టాభి వాడిన బోసిడీకే అనే ప‌దం. ఇంత‌కీ బోసీడీకే అంటే అర్థం ఏంటి? అది తిట్టేనా? లేక‌, మ‌రేదైనా మీనింగ్ ఉందా? అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. 

తాజాగా, బోసిడీకే ప‌దానికి అర్థం ఏంటో వివ‌రించారు వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు. బోసడీకే అంటే తిట్టు కాదని తేల్చారు. బోసడీకే అంటే అర్థం ‘మీరు బాగున్నారా’ అని గూగుల్‌లో ఉందని రఘురామ తెలిపారు. 

‘‘టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారు అన్న ఈ పదానికి అర్థం ఏంటా? అని నా స్నేహితులు పాతికమందిని అడిగా. వైసీపీలోని నా అజ్ఞాత స్నేహితులను కూడా అడిగా. ‘ఏమో మాకూ తెలీదు.. ఏదో బూతు పదమేమో’ అని చెప్పారు. అప్పుడు నేను గూగుల్‌లో వెతికా. అందులో చాలా స్పష్టంగా ఉంది. ‘సర్.. మీరు బాగున్నారా’ అనేది సంస్కృతంలో బోసడీకే అనే ప‌దానికి అర్థం.’’ అని రఘురామ రాజు వివరించారు.