ఫోన్లో మాట్లాడం బాబోయ్...

ఇప్పుడు రాజకీయ నేతలలో పట్టుకున్న భయం ఏంటంటే ఫోన్ లో మాట్లాడటం. ఓటుకు నోటు కేసు వల్ల ప్రతి ఒక్కరికి ఎవరితో ఫోన్లో మాట్లాడదామన్నా భయపట్టకుంది. ఎవరితో మాట్లాడితే ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారో అని.. ఎవరు సీక్రెట్ గా రికార్డ్ చేస్తారో అని వణికిపోతున్నారంట. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా తెరాస నేతలకు జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ కూడా ఇచ్చారంట. ఎక్కడ తెదేపా వాళ్లు తమపై "spy camera" లు పెట్టి నిఘా విదించారో అని.. ఎవరు నమ్మకమైన వాళ్లో తెలియదు.. ఎవరిని నమ్మాలో తెలియదు.. ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారంట నేతలు. ఎంతో నమ్మకంతో రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించిన తెరాస ఇప్పుడు వాళ్లను ఎవరైనా ట్రాప్ చేస్తారేమో అని భయపడుతున్నారట. ఎందుకంటే ఒకప్పుడు తెరాసలో దళారీలు ఉండేవారు. వారి ద్వారా ఏ డీలింగ్స్ అయినా జరిగేవి. ఇప్పుడు జర్నలిస్టుల దగ్గరనుంజి ప్రతి ఒక్కరూ "deal makers" గ మారిపోవడంతో ఎవరిని దగ్గరకు రానివ్వాలో తెలియని పరిస్థితి ఏర్పడిందంట.

 

అసలు రాజకీయాలలో డబ్బులు ఖర్చుపెట్టనిదే పదవులు రావనేది జగమెరిగిన సత్యం. అంతెందుకు ఒక ఓటు వేసే ఓటరే డబ్బులు ముట్టజెప్పనిదే ఓటేసే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలప్పుడు ఓటుకు డబ్బులు ఇవ్వలేదని గొడవలు చేసిన ఉందంతాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పదవులు కొనుక్కుంటున్నాం.. ఒక ఎమ్మెల్యేగా, మంత్రి గా ఉన్నప్పుడు మాకొచ్చే వేతనాలు డీజిల్ ఖర్చులకు కూడా చాలవని.. ఇంకా రెండేళ్లు ఇలానే ఉంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని రాజకీయ నేతలు మొత్తుకుంటున్నారు. ఏదీ ఏమైనా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వల్ల రాజకీయ నేతలకు చాలా నష్టమనేది మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది.