విష్ణు ప్రియ అరెస్ట్ ?
posted on Mar 18, 2025 3:34PM
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నవారిపై తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11మందిపై కేసు నమోదు చేశారు. ఐపిఎస్ అధికారి సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపారు. కేసులు నమోదైన వారిలో విష్ణుప్రియ, హర్షసాయి, రీతూ చౌదరి, సుప్రీత, రీతూ చౌదరి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ , కిరణ్ గౌడ్, సన్నీయాదవ్, సుధీర్ రాజీలు ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలలోపు విచారణకు హాజరు కావాలని విష్ణు ప్రియకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు రానున్నారు. విష్ణు ప్రియను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.