విశాఖ అందాలకు బండి సంజయ్ ఫిదా
posted on Dec 20, 2025 3:05PM

విశాఖపట్నంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ర్యాలీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా అటల్ బీహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని బండి సంజయ్ ఆవిష్కరించారు. వైజాగ్ అందాలు, ప్రజలపై ప్రశంసలు కురిపించారు. ఈ నెల అందాలకు మాత్రమే కాదు.. పోరాటలకు ప్రసిద్ది. స్వాతంత్య్ర ఉద్యమాల నుంచి పోరాటల వరకు ఉత్తరాంధ్ర ప్రజల పాత్రను మరువలేము. అవసరమైతే సముద్రంలా ఉప్పొంగుతారు.
అవకాశలు రావటం ఆలస్యం అయినా ప్రజల ముఖంలో చిరునవ్వు తగ్గలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు నిరాశలో కాకుండా నమ్మకంతో జీవిస్తారు అని బండి సంజయ్ అన్నారు. అందుకే విశాఖ దేశానికి గర్వకారణమైందన్నారు. విశాఖ ఎదిగితే ఉత్తరాంధ్ర మాత్రమే కాదని, ఈ దేశమే ఎదుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు.‘‘అందుకే నేను గర్వంగా చెబుతున్నాను. వైజాగ్ సముద్రం కాదు. భావోద్వేగాల అల. ఉత్తరాంధ్ర ప్రజలు. మధ్య నిలబడి మాట్లాడే అవకాశం నాకు దక్కిన అదృష్టం. మీ ప్రేమకు… మీ ఆప్యాయతకు… మీ పోరాట పటిమకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.