సెహ్వాగ్ టీమిండియా కోచ్ ధరఖాస్తు.. షాకైన బీసీసీఐ..


డేరింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ మైదానంలో ఎలా చెలరేగి ఆడుతాడో అందరికి తెలిసిందే. ఇక ట్విట్టర్ విషయానికి వస్తే ఆయన చేసే ఫన్నీ కామెంట్స్, ఫన్నీట్వీట్లు నవ్వుతెప్పిస్తుంటాయి. ఇలా అన్నింటిలో కాస్త వెరైటీగా చేసే సెహ్వాగ్.. అదే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. భారత్ క్రికెట్ జట్టు కోచ్ పదవి నియామకం జరగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పదవికి ధరఖాస్తు చేసుకున్న సెహ్వాగ్ రెజ్యూమ్ చూసి బీసీసీఐ షాకైందట. ఇంతకీ దరఖాస్తులో ఏముందంటే.. ‘ ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ జట్టుకు మెంటర్‌, కోచ్‌గా ఉన్నాను.. టీమిండియాబాయ్స్‌ అందరితో ఆడాను’ అని ఉంది. ఇక అది చూసిన బీసీసీఐ అధికారులు ఆశ్చర్యపోయి... పూర్తి వివరాలతో కూడిన బయోడేటాను, రెజ్యూమ్‌ను పంపించమంటూ అతన్ని బతిమిలాడుకొని ఒప్పించారట. మొత్తానికి సెహ్వాగ్ తన కామెడీ టైమింగ్ ను ఇక్కడ కూడా వదల్లేదన్నమాట..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu