అమెరికాలో ఉన్మాది వీరంగం...

 

రెండు రోజుల క్రితం లండన్ లో జరిగిన ఉగ్రదాడి గురించి ఇంకా మరిచిపోకముందే అమెరికాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. వివరాల ప్రకారం... ఫ్లోరిడా రాష్ట్రంలోని ఆర్లాండోలోని ఓ వ్యాపార సంస్థలోకి 45 ఏళ్ల దుండగుడు కత్తి, తుపాకితో చొరబడ్డాడు. అనంతరం అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం తనను తాను కాల్చుకొని చనిపోయాడు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో సంస్థ అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించిందని.. దీంతో అతడు అసంతృప్తితో ఉన్నాడని.. తాజా ఘటనకు ఉగ్రవాదంతో సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu