ఢిల్లీ టెస్ట్‌‌పై కాలుష్యం ఎఫెక్ట్

కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిందో.. జనాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పీల్చేందుకు సరైన గాలి లేక ప్రజలు అపసోపాలు పడ్డారు. ఇప్పుడు దాని ప్రభావం క్రికెట్‌పై పడింది. భారత్-శ్రీలంక మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్ట్ ఢిల్లీలో జరగుతుంది.. కాలుష్య ప్రభావం కారణంగా క్రికెటర్లు బ్యాటింగ్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా శ్రీలంక ఆటగాళ్లు అయితే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. ఆపై ఆటగాళ్లందరికీ మాస్కులు పంపిణీ చేయడంతో వాటిని ధరించి ఆటను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టు 6 వికెట్ల నష్టానికి 523 పరుగుల వద్ద ఉంది. సాహా 1 పరుగుగుతోనూ, కోహ్లీ 243 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.