ధోనితో నన్ను పోల్చవద్దు...
posted on Jan 7, 2017 4:49PM

వన్డే, టీ20 సిరీస్ ల కెప్టెన్సీ నుండి ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. అందరూ అనుకున్నట్టే కెప్టెన్సీ పగ్గాలు మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ చేతికి వెళ్లాయి. అయితే ఇప్పుడు ఆయన ధోని గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో ఎక్కువగా అండగా ఉన్నది ఎవరైనా ఉన్నారంటే అది ధోనినేనని.. తాను చాలాసార్లు జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదంలో పడితే, ఆ సమయంలో ధోనినే కాపాడంటూ కోహ్లి ప్రశంసించాడు. అంతేకాదు.. 'వ్యక్తిత్వంలో ధోని ఉన్నతమైనవాడు.. నన్ను తీర్చిదిద్దడమే కాకుండా, చాలా అవకాశాలను నాకు కల్పించిన ఘనత ధోనిది.. నేను ఒక పూర్తిస్థాయి క్రికెటర్గా రూపాంతరం చెందానంటే దానికి కారణం ధోనినే అని.. అతను ఎప్పుడూ నా కెప్టెనే. అతనితో నాకు పోలికవద్దు'.. ధోనీతో తనను ఎప్పుడూ పోల్చవద్దని కోరాడు.