అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. భారత్ హైకమిషన్ కార్యాలయంపై దాడి

బంగ్లాదేశ్‌లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి.   బంగ్లాదేశ్ అతివాద నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఒస్మాన్ హాదీ మరణంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. ఈ నెల 12న ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను మొదట ఢాకాలోని ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఈ నెల  15న ఎయిర్ అంబులెన్స్ ద్వారా సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హాదీ బుధవారం (డిసెంబర్ 18) రాత్రి మరణించాడు. దీంతో ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి హింసాకాండకు తెగబడ్డారు. చిట్టగాంగ్ లోని భారత హైకమిషన్ కార్యాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.

అలాగే దేశ వ్యాప్తంగా పలు నగరాలలో ఆందోళనకారులు రెచ్చిపోవడంతో ఉద్రిక్త పరిస్థితుుల నెలకొన్నాయి.  రాజధాని ఢాకా సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలూ   దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్నాయి. భారత హైకమిషనర్ కార్యాలయంతో పాటు మీడియా సంస్థలపై కూడా ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు.  అతిపెద్ద బెంగాలీ వార్తాపత్రిక 'ప్రథమ్ ఆలో  డైలీ స్టార్' కార్యాలయాలకు నిప్పు పెట్టారు.    అలాగే  అవామీ లీగ్ కార్యాలయానికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వేలాది మంది షాబాద్ కూడలి వద్దకు చేరుకుని, రోడ్లను దిగ్బంధించారు. హాదీకి రక్షణ కల్పిం చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu