దిల్‍సుఖ్‍నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన
posted on Jan 7, 2026 7:33PM

జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్‍సుఖ్‍నగర్‌లో రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి రోడ్డు మీద బైఠాయించారు. భారీ సంఖ్యలో నిరుద్యోగులు రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని వారు నినాదాలతో హోరెత్తించారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల ముందస్తు మోహరింపు, అరెస్టుల పర్వంతో దిల్‍సుఖ్‍నగర్ ప్రాంతం మొత్తం కాసేపు హైడ్రామా నడిచింది.