బెజవాడలో నాన్‌వెజ్‌పై నిషేధం..

విజయవాడ నగరవాసులు చేపలు, మాంసం లాంటి నాన్‌వెజ్ ఆహారాన్ని తినాలనుకుంటే ఇవాళ, రేపు ఫుల్లుగా లాగించండి. ఎందుకంటే 9వ తేది నుంచి 25 వరకు నగరంలో మాంసాహారం దొరకదు. పవిత్ర కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రజారోగ్యం దృష్ట్యా మాంసాహారం, చేపల అమ్మకాలు నిషేధిస్తున్నట్లు కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా 16 రోజులపాటు కబేళాను కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. మాంసాహార దుకాణదారులు ఈ విషయాన్ని గ్రహించి ప్రభుత్వానికి సహకరించాలని..నిబంధనలు అతిక్రమించినట్లైతే కఠినచర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu