విజయపాల్ నెత్తిన ‘సుప్రీం’ పాలు!

ఏపీ సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.   ఉండి ఎమ్మెల్యే , మాజీ  ఎంపీ రఘురామ కృష్ణ రాజు కస్టోడియాల్ కేసులో నిందితుడైన విజయ్ పాల్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ పై విచారించిన సుప్రీం కోర్టు  తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ విజయ్ పాల్ పై  కఠిన చర్యలు తీసుకోవద్దని ప్రతివాదులకు ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని కూడా విజయపాల్ ను  సుప్రీం కోర్టు ఆదేశించింది.  ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. అంతకు ముందు విజయ్ పాల్ ముందస్తు బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు గత నెల 24న హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.