తెలంగాణాలో నియంత్రణలోకి కూరగాయల ధరలు!
posted on Mar 28, 2020 7:36PM
కూరగాయల ధరలు అందుబాటులోకి తేవడంతో పాటు అందుబాటులో ఉంచడంపై మార్కెటింగ్ శాఖ అధికారుల చర్యలను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు.
అవసరాలకు సరిపడా ఉల్లి, ఆలుగడ్డ నిల్వలు అందుబాటులోకి వచ్చాయి. నిన్న 1800, నేడు 6500 క్వింటాళ్లు మహారాష్ట్ర నుండి ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకున్నారు. యూపీ నుండి సరిపడినన్ని ఆలుగడ్డల దిగుమతి అయ్యాయి. గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుండి సరఫరా విషయంలో ఇబ్బందులు ఎదురైయ్యాయి. ఇప్పుడు పరిస్థితి చక్కబడింది.
331 ప్రాంతాలలో 177 మొబైల్ రైతుబజార్ల ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం దృష్టిసారించంది. నిత్యావసరాల కొరత అనే ప్రశ్న ఉత్పన్నం కావద్దు. కూరగాయల ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకోండి. పండ్లు, కూరగాయల రవాణాకు ఆయా మార్కెట్ల అధికారుల నుండి వాహనాలకు అనుమతి పత్రాలు పొందవచ్చు. కరోనా వైరస్ ప్రబలకుండా మార్కెట్లలో పకడ్భంధీ చర్యలు తీసుకోవడంతో పాటు, అధికారులు, సిబ్బంది కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.