వంగా గీత.. ప్లేటు ఫిరాయించేశారా?

రాష్ట్రంలో హాట్ నియోజకవర్గాలలో ఒకటైన పిఠాపురంలో అత్యధికంగా 86.86శాతం పోలంగ్ నమోదైన సంగతి విదితమే. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కల్యణ్ పోటీ చేయగా ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత బరిలోకి దిగారు.  వైసీపీ అధినేత జగన్ ఇక్కడ నుంచి పవన్ ను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో సర్వశక్తులూ ఓడారు. ఒక వైపు ముద్రగడ పద్మనాభం తన స్థాయిని దిగజార్చుకుని మరీ పవన్ పై అనుచిత వ్యాఖ్యలతో, అసందర్భ సవాళ్లతో విరుచుకుపడితే.. మరో వైపు జగన్ తన ఎన్నికల ప్రచార చివరి సభను ఇక్కడే నిర్వహించి, జనసేనానిపై తన పాత పెళ్లిళ్ల విమర్శలనే పునరుద్ఘాటించారు. 

ఇక పవన్ తరఫున ప్రచారాన్నంతా పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జ్  ఎస్పీఎస్ఎన్ వర్మ పర్యవేక్షణలో సాగింది. ఆయన ప్రచారానికి అద్భుత స్పందన కూడా కనిపించింది. మరో వైపు వంగా గీత ప్రచారానికి జనస్పందన కరవైంది. పోలింగ్ అనంతరం క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న సమాచారం, పోలింగ్ తరువాత వైసీపీ అంచనాలు అన్నీ కూడా ఇక్కడ నుంచి పవన్ కల్యాణ్ ఘన విజయాన్నే సూచిస్తున్నాయి.  పవన్ విజయం కంటే కూడా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన సాధించబోయే మెజారిటీపైనే అందరి ఆసక్తి కేంద్రీకృతమై ఉంది. 

ఇక వంగీ గీత కూడా నేరుగా కాకపోయినా పరోక్షంగా తన పరాజయాన్ని అంగీకరించేశారు. ఇటీవల అంటే పోలింగ్ తరువాత ఆమె ఒక సందర్భంగా పవన్ కల్యాణ్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హైకమాండ్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా తాను ప్రచారంలో ఎన్నడూ పవన్ కల్యాణ్ ను విమర్శించలేదనీ, ఆయనపై వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. అలాగే చిరంజీవి అన్నా ఆయన కుటుంబం అన్నా తనకు ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికలలో ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను ప్రజారాజ్యం అభ్యర్థిగా విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ తనకు మెగాఫ్యామిలీ పట్ల అంతులేని గౌరవాభిమానాలు ఉన్నాయని చెప్పుకున్నారు. 

అయితే నెటిజనులు మాత్రం వంగీ గీత మాటలను కొట్టి పారేస్తున్నారు. నిజంగా ఆమెకు పవన్ కల్యాణ్ పై అంత గౌరవం, అభిమానం ఉంటే.. వైసీపీ నాయకులు ద్వారంపూడి, ముద్రగడ వంటి వారు పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలను అప్పడే ఖండించి ఉండాలి కాదా అని నిలదీస్తున్నారు. పోలింగ్ పూర్తయిన తరువాత, ఓటమి ఖాయమని నిర్ణయానికి వచ్చిన తరువాత ఇప్పుడు తీరిగ్గా సెంటిమెంట్ డైలాగులు వల్లిస్తున్న వంగా గీతను తెగ ట్రోల్ చేస్తున్నారు.  ఆమె చెబుతున్న గౌరవం, అభిమానం వంటి మాటలన్నీ ఒట్టి నటనగా కొట్టి పారేస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu