మళ్లీ ఆస్పత్రికి వల్లభనేని వంశీ

విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.   వివిధ కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ మీద తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. గన్నవరంలో భారీగా అక్రమ మైనింగ్‌ కేసుకు పాల్పడ్డారని ఆరోపణల మీద ఒక కేసు, నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో మరో కేసును నమోదు చేశారు.

అయితే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన నూజివీడు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఆ పిటిషన్ పై  నూజివీడు కోర్టు సోమవారం (మే 20)  దీనిపైన విచారణ జరపనుంది. 2019 ఎన్నికల్లో తన గెలుపు కోసం పని చేసిన బాపులపాడు మండలం కొయ్యూరు, పెరికీడు గ్రామాలకు చెందిన కొంత మందికి నకిలీ ఇళ్ల స్థలాల పత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ అక్టోబరులో హనుమాన్‌ జంక్షన్‌ పీఎస్‌లో  9 మందిపై కేసు నమోదు చేశారు.

అయితే నాడు కేసు నమోదు చేసిన వారి జాబితాలో వంశీ పేరు లేదు. అయితే 2024లో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇదే కేసుకు సంబంధించి ఇచ్చిన  ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వంశీ హయాంలో ఈ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, వీటిపైన అధికార ముద్రలు నకిలీవని రెవిన్యూ అధికారులు ఇచ్చిన నివేదకలో తేలిందని, దీంతో వంశీని కూడా  నిందితుడుగా చేర్చారు.  ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం జైల్లో ఉన్న వంశీని శుక్రవారం నూజివీడు 2వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ శ్రావణి ముందు పోలీసులు హాజరు పరిచారు. అదలా ఉంటే.. వల్లభనేని వంశీ గురువారం (మే 17) జైలులో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హుటాహుటిక ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. అనంతరం అదే రోజు మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు వంశీని తీసుకువెళ్లారు. తాజాగా శనివారం కూడా వల్లభనేని వంశీ మరో సారి అస్వస్థతకు గురి కావడంతో జైలు అధికారులు ఆయనను ఆస్పత్రికితి తరలించారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu