సెల్ఫీ తీసుకుందామని.. భార్యను చంపేసిన భర్త..
posted on Jun 1, 2016 3:21PM

సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు మరణించినవారు చాలామందే ఉన్నారు. అయితే అదే సెల్ఫీ పేరుతో తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణమైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. యూపీలోని మీరట్లో ఆప్తాబ్ అనే వ్యక్తి తన భార్య ఆయేషాతో సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి గంగానది వద్దకు తీసుకెళ్లి నదిలో తోసేశాడు. అనంతరం.. తన ఎనిమిది నెలల కొడుకుతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కొందరు దుండగులు తమపై దాడి చేశారని, ఆ గొడవలో తన భార్యను గంగా నదిలో తోసేశారని పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే అప్తాబ్ పై అనుమానం వచ్చిన పోలీసులు అతనిని విచారించగా అసలు నిజం బయటపడింది. అదనపు కట్నం కోసం భార్య ఆయేషాతో తరుచూ తగాదాలు పెట్టుకుంటోన్న ఆఫ్తాబ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.