రమణ దీక్షితులుపై టీటీడీ వేటు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ గౌరవ అర్చకుడు రమణ దీక్షితులుపై వేటు వేసింది. జగన్ హయంలో తిరుమల పవిత్రత దెబ్బ తిందన్న అర్ధం వచ్చేలా రమణ దీక్షితులు ఇటీవల చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఆయన  ఆలయ గౌరవ అర్చకత్వంపై తిరుమల తిరుపతి దేవస్థానం వేటు వేసింది.

ఆలయ ఈవో ధర్మారెడ్డి మతం పై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణదీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం అభిప్రాయపడింది. దీంతో ఆయనను ఆలయ గౌరవ అర్చక పదవి నుంచి తొలగించింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ భూమన వెల్లడించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu