బెయిలు నిరాకరణ..జైల్లోనే ఈటెల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్‌కు సికింద్రాబాద్ రైల్వే కోర్టు మంగళవారం సాయంత్రం కూడా బెయిలు నిరాకరించింది. దీంతో ఆయన మూడు రోజులుగా జైల్లోనే ఉంటున్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు శనివారం రోజు ఈటెల రాజేందర్ హైదరాబాదులో రైలు రోకోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆయనకు ఇప్పటి వరకు బెయిలు దొరకలేదు. దీంతో ఆయన శనివారం నుండి జైలులోనే ఉంటున్నారు. ఈటెలతో పాటు కాంగ్రెసు ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యేలు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, కాంగ్రెసు ఎంపీలు పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తదితరులు అరెస్టయిన విషయం తెలిసిందే. అందులో కొందరికి శనివారమే బెయిలు రాగా చాలమందికి బెయిలు రావడానికి చాలా సమయం పట్టింది.