స్కూలు బస్సు ప్రమాదం మృతులు 16 మంది!
posted on Jul 24, 2014 11:09PM
.jpg)
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద ఓ ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 16 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 14 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. కాకతీయ పాఠశాలకు చెందిన బస్సు రైల్వే గేటు దాటుతుండగా నాందేడ్ ప్యాపింజర్ ఢీకొంది ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 34 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో 16 మంది మరణించగా, 20 మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పవన్ కళ్యాణ్ తదితరులు పరామర్శించారు.