డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత అరెస్ట్!
posted on Jun 14, 2023 11:17AM
అప్పట్లో డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. పలువురు తెలుగు సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా డ్రగ్స్ కేసులో ఓ ప్రముఖ సినీ నిర్మాతను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
ఇటీవల ఓ డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను పోలీసులు సేకరించగా.. అందులో సినీ నిర్మాత కేపీ చౌదరి కూడా ఉన్నారు.
కేపీ చౌదరి డగ్స్ వాడుతున్నట్టు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఆయన నుంచి కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమాను తెలుగులో కేపీ చౌదరి విడుదల చేశారు.